మోడీ ఫారిన్ టూర్‌: 21 ప‌ర్య‌ట‌నలు.. 22 కోట్ల ఖ‌ర్చు

Update: 2023-02-03 06:00 GMT
దేశ ప్ర‌ధానులు విదేశాల‌కు వెళ్ల‌డం స‌హ‌జం.. అవ‌స‌రం కూడా. దౌత్య సంబంధాల బ‌లోపేతానికి ఇవ‌న్నీ కూడా కామ‌న్‌గానే జ‌రుగుతాయి. అయితే.. ఆయా స‌మ‌యాల్లో చేసే ఖ‌ర్చు విష‌యంలోనే కొంద‌రు ప్ర‌ధాను లు ఆచి తూచి ఖ‌ర్చు చేస్తారు. మ‌రికొంద‌రు.. మ‌న‌ది కాదుగా.. అన్న‌ట్టు ఖ‌ర్చు చేసేస్తుంటారు. గ‌తంలో యూపీఏ ప్ర‌భుత్వంలో మ‌న్మోహ‌న్‌సింగ్ ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు.. అత్యంత ఆచితూచి ఖ‌ర్చు చేసేవారు.

కానీ, ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మాత్రం.. చేతికి ఎముక‌లేద‌న్న‌ట్టుగా ఖ‌ర్చు చేస్తున్నారు. ఎన్డీయే 2 హ‌యాంలో ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు 21 సార్లు ప్ర‌పంచ దేశాల‌ను చుట్టివ‌చ్చాయి. అమెరికా వెళ్లారు. దుబా య్ వెళ్లారు. అదేవిధంగా ఇత‌ర దేశాల‌కూ వెళ్లారు. ఈ ప‌ర్య‌ట‌న‌లు మొత్తం 21గా లెక్క తేలాయి. అయితే.. ఆయా ప‌ర్య‌ట‌న‌ల‌కు సంబంధించి.. ఏకంగా 22.76 కోట్ల  రూపాయ‌ల‌ను ఖ‌ర్చుచేసిన‌ట్టు కేంద్రం వెల్ల‌డించింది.

 2019 నుంచి ప్రధాని మోడీ విదేశీ పర్యటనల కోసం రూ.22.76కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర విదేశాంగ శాఖ  సహాయ మంత్రి వి. మురళీధరన్‌ రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలియ‌జేశారు. ఈ నాలుగేళ్లలో ప్రధాని మొత్తం 21 సార్లు విదేశాల్లో పర్యటించగా.. జపాన్‌కు మూడు సార్లు, అమెరికాకు రెండు, యునైటెడ్‌ అరబ్‌కు రెండు సార్లు వెళ్లినట్లు ఆయన తెలిపారు.

రాష్ట్ర‌ప‌తి ఖ‌ర్చు.. 6 కోట్లు

దేశ ప్ర‌ధ‌మ పౌరుడు.. మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ 2019 నుంచి 8 సార్లు విదేశీ పర్యటనలు చేయగా.. అందుకు రూ.6.24కోట్లు ఖర్చయినట్లు కేంద్రం తెలిపింది. దీనిలో 7 పర్యటనలు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ చేయగా.. ప్రస్తుత ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము ఒకసారి యూకే పర్యటన(ఎలిజ‌బెత్ 2 మ‌ర‌ణం నేప‌థ్యంలో)కు వెళ్లారు.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News