మోడీ క‌వ‌రింగ్ మామూలుగా లేదుగా!

Update: 2018-05-19 09:52 GMT
ఆడు మ‌గాడ్రా బుజ్జీ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు ప్ర‌ధాని మోడీ. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు చూస్తే.. ఆయ‌న మాత్ర‌మే ఈ త‌ర‌హా రాజ‌కీయాలు చేయ‌గ‌ల‌ర‌న్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. త‌నను అడుగ‌డుగునా దెబ్బేస్తున్న ఒక ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి పార్టీకి చెందిన ప్ర‌ముఖ నేత‌కు ప్ర‌ధాని స్థానంలో ఉన్న వ్య‌క్తి ఫోన్ చేయ‌టం క‌ల‌లో కూడా ఊహించ‌నిది. ఎంత పుట్టిన రోజు అయితే మాత్రం గ్రీటింగ్స్ చెప్పేందుకు.. మోడీనే ఒక అడుగు ముందుకేసి దేవెగౌడ‌కు ఫోన్ చేయ‌టం మామూలు విష‌యం కాదు.

ఇదిలా ఉంటే.. క్ష‌ణ‌క్ష‌ణానికి మారిపోతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కూ బీజేపీకి తిరుగులేద‌న్న‌ట్లుగా ఉన్న ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చిందంటున్నారు. విశ్వాస ప‌రీక్ష‌లో తుది ఫ‌లితం ఎలా ఉంటుంద‌న్న విష‌యంపై ఇప్ప‌టికే ఒక క్లారిటీ వ‌చ్చిన వేళ‌.. ప్ర‌ధాని మోడీ ఇప్పుడెక్క‌డ ఉన్నారు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

క‌ర్ణాట‌క రాజ‌కీయం మొత్తాన్నితెర వెనుక ఉండి న‌డిపిస్తున్న ప్ర‌ధాన రాజ‌కీయ శ‌క్తిలో ప్ర‌ధాని మోడీ ఒక‌ర‌న్న విష‌యం అంద‌రికి తెలిసిందే. అలాంటి మోడీ.. చేయాల్సినంత చేసిన త‌ర్వాత కూడా ఫ‌లితం సానుకూలంగా ఉండ‌ద‌న్న మాట నేప‌థ్యంలో ఇప్పుడు ఆయ‌నేం చేస్తారు?  ఎలా రియాక్ట్ అవుతార‌న్న ఆస‌క్తి కొంద‌రిలోఉంది. ఇదిలా ఉంటే.. మోడీ ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేశారు.

దీంతో తాను ఎక్క‌డ ఉన్న‌ది?  ఏం చేస్తున్న‌ది చెప్పేశారు. లేహ్‌.. శ్రీ‌న‌గ‌ర్‌.. జ‌మ్మూక‌శ్మీర్ లోని మూడు ప్రాంతాల్లో ఈ రోజు ప‌ర్య‌టిస్తున్న మోడీ తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఈ రోజు త‌న‌కు చాలా ఆనందంగా ఉంద‌ని.. తాను జ‌మ్ముక‌శ్మీర్ లో 13 ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు. తాను లేహ్ సంద‌ర్శించిన త‌ర్వాత శ్రీ‌న‌గ‌ర్ కు వెళ్ల‌నున్న‌ట్లు చెప్పారు.

ఇదిలా ఉంటే క‌శ్మీర్ కు వ‌చ్చి ప్ర‌ధాని మోడీకి ఘ‌న స్శాగ‌తం ప‌లికారు ఆ రాష్ట్ర సీఎం ముఫ్తీ మెహ‌బూబా. మోడీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో మ‌రింత ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. కింద ప‌డి పైచేయి నాదేన‌న్న చందంగా మోడీ వ్య‌వ‌హ‌రిస్తార‌ని చెబుతున్నారు. మోడీ క‌శ్మీర్ ప‌ర్య‌ట‌న ఫ‌స్ట్ టైం అయి ఉంటే ఈ త‌ర‌హా భావోద్వేగాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. కానీ.. కాశ్మీర్ వ్యాలీకి ఆ రాష్ట్ర ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌ర‌చూ వెళ్ల‌టం తెలిసిందే. అలాంటి మోడీ.. ఇప్పుడే తొలిసారి క‌శ్మీర్ చూస్తున్న‌ట్లు మ‌రీ ఇంత ఎమోష‌న‌ల్ అవ్వొచ్చు. ఇప్ప‌టికే ప‌లుమార్లు తిరిగి మోడీ.. త‌న మ‌న‌సులోని మాటను  భ‌లే  ట్విస్ట్ చేసి రాసిన‌ట్లుగా చెబుతున్నారు.


Tags:    

Similar News