రాజు తలుచుకుంటే దెబ్బలకే కాదు.. వరాలకు కొదవ ఉండదు. మాటల్లో వినిపించేదే ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ మానసపుత్రికల్లో ఒకటి స్వచ్ఛభారత్. ఈ కాన్సెప్ట్ ను ఎవరూ ప్రమోట్ చేసినా మోడీ రియాక్ట్ కావటం తెలిసిందే. ఆ మధ్యన ఒక పెళ్లి శుభలేఖలో స్వచ్ఛభారత్ ను ప్రమోట్ చేయటంపైనా సోషల్ మీడియాలో ప్రధాని స్పందించటం మర్చిపోకూడదు.
అలాంటిది ఆ కాన్సెప్ట్ తో ఒక సినిమాను తీస్తే? ఇప్పటికే స్వచ్ఛభారత్ కాన్సెప్ట్ తో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్.. భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథా చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి హీరో అక్షయ్.. ప్రధాని మోడీని కలవటం.. ఈ సినిమా కథ గురించి చెప్పినప్పుడు ఆయన విపరీతంగా నవ్వినట్లుగా చెప్పటం తెలిసిందే.
తాజాగా ఈ చిత్రం నెల 23న విడుదల కానుంది. మోడీ మనసు దోచుకున్న ఈ సినిమాకు సంబంధించి మోడీ మార్క్ దన్ను ఒకటి రానుందని చెబుతున్నారు. ఈ సినిమాకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వినోదపన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. సినిమా విడుదలకు కాస్త ముందు ఈ విషయాన్ని వెల్లడించే అవకాశం ఉందని చెబుతున్నారు. మోడీ మనసుకు నచ్చితే ఆ మాత్రం తోఫా ఇవ్వకుండా ఉంటారా చెప్పండి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/