బ్యాంకు ఖాతాదారుల కు మోడీ శుభవార్త

Update: 2020-02-01 10:14 GMT
ప్రస్తుతం దేశంలో అసలు బ్యాంకు ఖాతా లేని వారు ఉన్నారంటే అతిశయోక్తే.. మోడీ సర్కార్ జన్ ధన్ పేరుతో అందరికీ ఖాతాలు తీయించింది. తాజాగా కేంద్ర బడ్జెట్ లో మోడీ సర్కారు ఖాతాదారులకు తీపికబురును అందించింది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది. ఇందులో బ్యాంకు ఖాతాదారులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నారు.

బ్యాంకు డిపాజిట్ల పై ఇన్సూరెన్స్ పరిమితిని భారీగా పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రతిపాదించారు. ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లపై రూ. లక్ష వరకు మాత్రమే ఇన్సూరెన్స్ లభిస్తోంది. ఇప్పుడు డిపాజిట్లపై ఇన్సూరెన్స్ పరిమితిని ఏకంగా రూ.5 లక్షలకు పెంచుతామని నిర్మలా ప్రకటించారు. ఇది బ్యాంకు కస్టమర్ల కు ప్రయోజనం కలిగించే గొప్ప నిర్ణయమనే చెప్పాలి.

బ్యాంకులు దివాలా తీసినప్పుడు.. బ్యాంకు లో డబ్బులు ఉన్న వారికి ఇన్నాళ్లు లక్షవరకూ మాత్రమే ఇన్సూరెన్స్ వస్తుంది. ఇకపై ఏకంగా రూ.5 లక్షల వరకూ ఇన్సూరెన్స్ లభిస్తుంది. బ్యాంకులో అకౌంట్ కలిగిన అందరికీ ఈ లాభం చేకూరుతుంది.
Tags:    

Similar News