వైఎస్ జగన్ కు మోడీ శుభవార్త.. కీలక నిర్ణయం

Update: 2020-10-03 13:00 GMT
కేంద్రంలోని ప్రతి బిల్లులో బీజేపీ సర్కార్ కు అండగా నిలబడుతున్న ఏపీలోని జగన్ సర్కార్ కు మోడీ శుభవార్త చెప్పారు.   రాజధాని కూడా లేని అప్పుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ఊరటనిచ్చే నిర్ణయాన్ని కేంద్రం తాజాగా వెలువరించారు.

తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఏపీ ప్రభుత్వానికి అదనపు రుణం పొందడానికి అనుమతిచ్చింది. ఏపీ ప్రభుత్వ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్), ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలను విజయవంతంగా అమలు చేయడం ఇందుకు కారణంగా తెలుస్తోంది.

కరోనా కష్టకాలంలో అదనపు రుణ అనుమతి నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి గొప్ప ఊరటగా చెప్పవచ్చు. ఇక ఏపీకి మాత్రమే కాకుండా బీజేపీ సర్కార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇదే వెసులుబాటు ఇచ్చింది. అదనపు రుణం పొందడానికి అనుమతినిచ్చింది. వన్ రేషన్, వన్ కార్డ్ సిస్టమ్ ను అమలు చేసిన ఆరోరాష్ట్రం యూపీ ఈ అదనపు రుణ అర్హత సాధించింది.

మోడీ సర్కార్ నిర్ణయంతో ఈ రెండు రాష్ట్రాలు అదనంగా రూ.7106 కోట్లను రుణంగా పొందవచ్చు. ఇందులో ఉత్తరప్రదేశ్ 4851 కోట్లు అదనంగా రుణాన్ని సమీకరించుకోవచ్చు.

పీడీఎస్ సంస్కరణలు సహా వన్ రేషన్ వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు స్కీమ్ ను విజయవంతంగా అమలు చేశాయని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. ఏపీ అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ లో టాప్ స్థానంలో ఉండి ఈ అర్హత సాధించింది.
Tags:    

Similar News