మోడీ సర్కార్ కొత్త స్కీమ్.. 3 లక్షల మంది టార్గెట్

Update: 2020-12-26 12:45 GMT
కరోనా కల్లోలంతో దేశంలో ప్రజలందరూ ఉద్యోగ ఉపాధి కోల్పోయి నానా యాతన పడ్డారు. వారికి స్వాంతన చేకూరేలా మోడీ సర్కార్ ఎలాంటి చర్యలు చేపట్టలేదనే విమర్శలు ఎదుర్కొంది. ఈ క్రమంలోనే కొత్త స్కీమ్ ను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది.

కరోనా వైరస్ కారణంగా జాబ్ మార్కెట్ పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఆ స్తబ్దతను తొలగించడానికి ఇప్పుడు మోడీ సర్కార్ నడుం బిగించింది. కొత్త స్కీమ్ ద్వారా జాబ్ మార్కెట్ ను ఆదుకోవాలని యోచిస్తోంది. ఎక్కువమందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని చూస్తోంది.

యువత లక్ష్యంగా ఈ కొత్త స్కీమ్ ఉండబోతోంది. 3 లక్షల మంది కొత్త పారిశ్రామికవేత్తలను ఈ పథకం ద్వారా తయారు చేయనున్నారు. వారి ద్వారా మరికొంత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని యోచిస్తున్నారు. ఈ 3 లక్షల మంది ద్వారా మరింత మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి.

స్కిల్స్ డెవలప్ మెంట్ మినిస్ట్రీ ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఒక డ్రాఫ్ట్ ను తయారు చేసింది. ఈ స్కీమ్ పేరు పీఎం ఉద్యం మిత్రా ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎంట్రప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్. ప్రస్తుతం ఈ స్కీమ్ పై చర్చిస్తున్నారు.

ఇక ఈ పథకంలో రాష్ట్రాలు కూడా భాగస్వామ్యం కానున్నాయి. ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను గుర్తించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది. ఈ పథకంలో 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత 18 నెలలు అవసరమైన మద్దతును కేంద్రం నుంచి లభిస్తుంది.
Tags:    

Similar News