మరో నాలుగు బ్యాంకులు ప్రైవేటు పరం .. చట్ట సవరణలకి సిద్ధమౌతోన్న మోదీ సర్కార్
కేంద్రంలో అధికారంలో ఉండే మోడీ ప్రభుత్వం మరో నాలుగు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటు పరం చేయాలని మోదీ సర్కార్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ జాభితాలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నట్లు తెలుస్తోంది. 2021–2022 ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకులను ప్రైవేటు పరం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ ఏప్రిల్ లో ప్రారంభం కాబోతుంది. సెంట్రల్ బ్యాంక్ లాంటి మధ్య తరహా బ్యాంకుల ప్రైవటైజేషన్ సక్సెస్ అయితే పెద్ద బ్యాంకులను సైతం ప్రైవేట్ పరం చేస్తారని తెలుస్తోంది.
ప్రస్తుతం సెంట్రల్ బ్యాంకులో 33 వేల మంది, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 50 వేల మంది, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 26 వేల మంది, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 13 వేల మంది విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ ప్రైవేటైజేషన్ ప్రక్రియను వారంతా తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే .. ఈ నాలుగు బ్యాంకులే కాకుండా మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్ బీ) ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేసే దిశగా రెండు చట్టాలకు కేంద్ర ప్రభుత్వం త్వరలో సవరణలు చేయబోతుందట.
బ్యాంకింగ్ కంపెనీల చట్టం 1970, బ్యాంకింగ్ కంపెనీల చట్టం 1980లో నిర్దిష్ట సవరణలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటి ఆధారంగానే పలు ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేశారని, ప్రైవేటీకరణ చేయాలంటే వీటిలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని వివరించాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సవరణలను ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి. 2021–22 బడ్జెట్ ప్రసంగం సందర్భంగా పీఎస్ బీల ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రస్తావించిన విషయం తెలిసిందే.