బీజేపీ రాష్ట్ర నాయకులు.. రాష్ట్రవ్యాప్తంగా.. మోడీ జన్మదిన పక్షోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోవారు..రాష్ట్రానికి.. బీజేపీ తరఫున మోడీ చాలా ఇచ్చారని చెబుతున్నారు. రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు నుంచి కీలక మైన నాయకుల వరకు కూడా అందరూ.. ఇదే పాట పాడుతున్నారు. అనేక మైన పథకా లు ఇస్తున్నారు. నిధులు ఇస్తున్నారు.. అందుకే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని చెబుతున్నారు.
అయితే.. తీరా లెక్కల విషయానికి వచ్చేసరికి మాత్రం.. గత చంద్రబాబు హయాంలో ఇచ్చిన వాటిని చెప్పుకొస్తున్నారు. రాజధానికి 1500 కోట్లు ఇచ్చారని అంటున్నారు. వాస్తవానికి చంద్రబాబు హయాంలో ఇచ్చిందే 1200 కోట్లు. ఇక, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చారని అంటున్నారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూపాయి కూడా ఈ నిధులు ఇవ్వలేదు. ఇక, వివిధ పథకాలు అమలు చేస్తున్నారని చెబుతున్నారు. అవి ప్రజలకు చేరుతున్నాయని అంటున్నారు.
వాస్తవానికి మోడీ ఏం చేసినా.. దేశం మొత్తంలో అమలు చేస్తున్న పథకాలనే రాష్ట్రంలో అమలు చేస్తు న్నారు. ప్రత్యేకంగా ఆయన అమలు చేస్తున్న పథకాలు లేవు. పైగా.. కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన నిధులను మాత్రమే ఇస్తోంది.
ఈ పరిణామాలను గమనిస్తే.. బీజేపీ నేతలు చెబుతున్న దానికీ.. క్షేత్రస్తాయిలో ఉన్న పరిణామాలకు పొంతన లేదు. దీంతో రాష్ట్రంలో బీజేపీని సపోర్టు చేస్తున్న జనసేన కూడా.. బీజేపీ ఇది చేసింది. అని చెప్పుకోలేక పోతోంది.
పోనీ.. సోము వీర్రాజు చెబుతున్నట్టు అన్నీ చేస్తే.. రాష్ట్రంలో పోలవరం ఎందుకు ముందుకు సాగడం లేదు.? రాజధానికి మద్దతంటారు.. కానీ రైతులు పాదయాత్ర చేస్తుంటే.. వారికి అనుకూలంగా కేంద్రం నుంచి ఒక్క ప్రకటనైనా ఎందుకు చేయించలేక పోతున్నారు? అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్నలు.. సరే.. ఇప్పుడు ఇవన్నీ.. పాతవే అయినా.. ఎప్పటికప్పుడు.. బీజేపీ నేతలు చెబుతున్న మాటలతో పోల్చితే.. వారు రాష్ట్రానికి ఏం చేశారనే ప్రశ్న మాత్రం ఉదయిస్తుండడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.