మోదీ హీరో.. సమస్యలొస్తే పారిపోడు.. ఎదురెళతాడు..! రతన్​ టాటా ప్రశంసలు

Update: 2020-12-20 03:38 GMT
ప్రధాని నరేంద్ర మోదీపై ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్​ టాటా ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ ఆలోచనలు, ఆకాంక్షలు చాలా మందికి అర్థం కావు. అందుకే ఆయనను తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ మోదీ ఓ విజన్​ ఉన్న నేత. సంక్లిష్టమైన సమస్యలను సులువుగా పరిష్కరించేందుకు ఆయన ఎంతో శ్రమిస్తుంటారు. ఓ వైపు కరోనా, మరోవైపు ఆర్థికసంక్షోభంతో దేశం విలవిలలాడుతుంటే.. మోదీ ఇండియాను సమర్థంగా ముందుకు నడుపుతున్నారని ఆయన ప్రశంసించారు.  అసోచామ్ ఫౌండేషన్ వీక్, 2020 కార్యక్రమంలో రతన్ టాటా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు.

రతన్​టాటా ఇంకా ఏమన్నారంటే.. ‘నేనో వ్యాపారిని అయితే ప్రధాని నరేంద్రమోదీ తీసుకుంటున్న నిర్ణయాలను ఆర్థిక సంస్కరణలను పొగడకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే ఆయన దేశభవిష్యత్​ కోసం ఆలోచిస్తున్నారు. మోదీ తీసుకొనే నిర్ణయాలు ఇప్పుడు కఠినంగానే అనిపించవచ్చు. కానీ వాటి ప్రయోజనాలు దీర్ఘకాలికం. ఆయన ఎటువంటి సమస్య వచ్చినా తడబడలేదు. తప్పించుకోలేదు. సమస్యలకు ఎదురెళ్లి పోరాడాడు’ అంటూ రతన్​ టాటా ప్రశంసించారు.


మోదీ నిర్ణయాల పట్ల విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. కానీ ఆయన దీటుగా బదులు చెబుతున్నారు. ‘కరోనా టైంలో లాక్​డౌన్ పెట్టడం మామూలు నిర్ణయం కాదు. దేశ ఆర్థికపరిస్థితి దెబ్బతింటుందని మోదీకి తెలుసు.అయినప్పటికీ ఆయన  ప్రజల ఆరోగ్యం గురించి మాత్రమే ఆలోచించారు. దేశ సమైఖ్యత విషయంలో ఆయన ఎప్పుడూ రాజీపడలేదు.. దేశాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో పారిశ్రామిక వేత్తల పాత్ర ఎంతో ఉంది. నేను అయితే అందుకు సిద్ధంగా ఉన్నాను.’ అని రతన్​టాటా పేర్కొన్నారు.
Tags:    

Similar News