ప్రధాని నరేంద్ర మోదీపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు దాదాపుగా దేశంలోని చాలా పార్టీలు దునుమాడుతున్నాయి. ప్రజాకర్షక పాలన సాగిస్తానంటూ గడచిన ఎన్నికల్లో మాయ మాటలు చెప్పిన మోదీ అధికారంలోకి రాగానే ప్రజాకంటక నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారని ఆయా పార్టీలు మోదీ తీరుపై మండిపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ తరహా విమర్శలు వెల్లువలా వినిపిస్తూ ఉంటే... ఇటీవలే ఆ పార్టీలో చేరి ఏకంగా ఎంపీ టికెట్ కూడా సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ డ్రీమ్ గర్ల్ - రంగీలా బేబీ ఊర్మిళా మటోండ్కర్ ఆ పార్టీ వైఖరికి భిన్నంగా వ్యవహరించి అందరినీ ఆశ్యర్యానికి గురి చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఊర్మిళ... నేటి మధ్యాహ్నం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మోదీ వ్యక్తిత్వాన్ని మెచ్చుకుని అందరికీ షాకిచ్చారు.
మోదీ వ్యక్తిగతంగా మంచి వారేనని వ్యాఖ్యానించిన ఊర్మిళ... ఆ వెంటనే మోదీ మంచి వారే అయినా... ఆయన విధానాలు మాత్రం సరికావంటూ ట్విస్ట్ ఇచ్చారు. అయినా ఈ సందర్భంగా ఊర్మిళ ఏమన్నారంటే.. *మోదీ వ్యక్తిగతంగా మంచివారే. కానీ ఆయన విధానాలు సరైనవి కావు. మోదీ హయాంలో దేశంలో అసహనం పెరిగిపోయింది. మతం పేరుతో ప్రజలు కొట్టుకుంటున్నారు. మోదీ పాలనలో ప్రజలు సంతోషంగా లేరు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదు. నిరుద్యోగం సమస్య పెరిగిపోయింది* అంటూ తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. అయినా రాజకీయాలకు కొత్త కదా.... ఈ తరహా పొరపాట్లు సహజమే అన్న భావన వినిపించినా.. కాంగ్రెస్ కు స్టార్ క్యాంపెయినర్ తరహాలో బిల్డప్ ఇవ్వాల్సిన ఊర్మిళ నోట ఈ మాటలు రావడం నిజంగా ఆ పార్టీ నేతలకు షాకేనని చెప్పక తప్పదు.