మోడీ ‘నియంత’ పాలన కోరుకుంటున్నాడా?

Update: 2020-09-23 13:00 GMT
వందేళ్ల కాంగ్రెస్ పాలనకు విసిగివేసారిన జనం.. ఒక గొప్ప మార్పు రావాలని ప్రజలంతా కలిసి ఏకపక్షంగా దేశంలో నరేంద్రమోడీని గెలిపించారు. అయితే ప్రజలకు మెరుగైన పాలన అందించాల్సిన మోడీజీ ఇప్పుడు తన ఇష్టానుసార నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రాలను తొక్కేసి.. వారికి అధికారం లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని బీజేపీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

వివరాల్లోకి వెళితే జీఎస్టీ పెట్టినప్పుడు బీజేపీ లేని రాష్ట్రాలకు నష్టపరిహారం ఇస్తాం అని ఒప్పించి ఆ చట్టాన్ని కేంద్రం అమలు చేయించింది. ఇక దేశ భవిష్యత్ కోసం నాడు రాష్ట్రాలు కూడా ఆదాయం కోల్పోతున్నా సరే త్యాగం చేశారు. సరే దేశం కోసం ప్రతి భారతీయుడు మోడీ ప్రతిపాదించిన జీఎస్టీని ఒప్పుకున్నారు. రాష్ట్రాల జీఎస్టీని ఇప్పుడు కేంద్రం గాలికి వదిలేసింది. కరోనా పేరుతో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని.. జీఎస్టీ తగ్గిందని.. తాము ఇవ్వం అని.. రాష్ట్రాలకు ఎగనామం పెట్టింది.. పైగా రాష్ట్రాలు ఈ లోటు భర్తీకి అప్పులు తెచ్చుకోండి అని చావు కబురు చల్లగా చెప్పారు.

అదేవిధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్.. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్.. వన్ నేషన్ వన్ ఎలక్ట్రిసిటీ బిల్.. ఇలా రైతులకు విద్యుత్ మీటర్లు బిగించే కార్యక్రమాన్ని కేంద్రం మొదలు పెట్టింది. ఇదంతా కార్పొరేట్స్ కు దోచిపెట్టడమేనన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వ్యవసాయ బిల్లు లాంటివి పెట్టి రాష్ట్రాలను తన గుప్పిట్లో పెట్టుకొని జమిలి ఎన్నికలకు పోయి పార్లమెంట్ లో 2/3 మెజారిటీ తెచ్చుకొని అధ్యక్ష పరిపాలన తీసుకొని రావాలని మోడీ ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే మూడోసారి మోడీ ప్రధానమంత్రి కాను అని స్టేట్ మెంట్ ఇచ్చాడు. అమెరికా మాదిరిగా కాకుండా రష్యా తరహాలో అధ్యక్ష పరిపాలన చేయాలని మోడీ ఆలోచన చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది.

అలా చేస్తే దక్షిణ భారత్ లో హిందీ భాషను కూడా అధికారికం చేయవచ్చు అని.. దేశం అంతా వాళ్ల చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని మోడీ చూస్తున్నాడనే ప్రచారం సాగుతోంది. అప్పుడు రాష్ట్రాలకు అధికారాలు లేకుండా దేశంలో మోడీ ఒక నియంత పాలన చేయాలని చూస్తున్నాడని సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి. మేధావులు కూడా మోడీ ప్లాన్ ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. చూద్దాం దేశంలో ఏం జరుగుతుందో..
Tags:    

Similar News