మోడీ షేక్‌ హ్యాండ్‌ : బ్రిటిష్‌ రాజుకు దబిడిదిబిడే!

Update: 2016-04-15 04:14 GMT
మనం మహేష్‌ బాబునే మిల్కీబాయ్‌ అనుకుంటూ ఉంటాం.. ఆ లెక్కన చూస్తే ప్రిన్స్‌ విలియమ్స్‌ ను ఏమనాలి? ఆయనను మీగడబేబీబాయ్‌ అంటే సరిపోతుందేమో. అలా లేతగా - ఎర్రగా గట్టిగా నడిస్తే కందిపోయేలా ఉండే ప్రిన్స్‌ విలియమ్స్‌ - పాపం మోడీ బారిన పడ్డాడు. చిన్నప్పటినుంచి కాయకష్టం చేసి పెరిగిన దృఢమైన మోడీ గట్టిగా షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేసరికి పాపం.. బ్రిటిష్‌ యువరాజు ప్రిన్స్‌ విలియమ్స్‌ పరిస్థితి దబిడి దిబిడే అయిపోయింది. మోడీ తో యువరాజు దంపతులు భేటీ అయిన సందర్భంలో మోడీ ఇచ్చిన షేక్‌ హ్యాండ్‌ నుంచి చేతిని వదలించుకునే సరికి, ఆయన చేయి పట్టుకున్నంత మేర యువరాజు చేయి పాలిపోయినట్లుగా అయిపోయి ప్రింట్‌ పడిపోయింది.

కొందరికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చినప్పుడు చేతిని చాలా గట్టిగా పట్టుకుని ఊపి మరీ తమ ఆనందాన్ని వ్యక్తం చేయడం అలవాటుగా ఉంటుది. మోడీ కూడా బహుశా ఆ బాపతు ఆనందాన్ని వ్యక్తం చేశాడో లేదా... ప్రిన్స్‌ విలియమ్స్‌ చేతిని పట్టుకున్న సమయంలో.. భారత దేశం మొత్తం వారి కుటుంబపు పాలనలో బానిసలుగా రెండు వందల ఏళ్లపాటూ మగ్గిపోయిన వైనం గుర్తుకు వచ్చి ఆ చేతిని మరింతగా బిగియపట్టుకున్నాడో గానీ.. మొత్తానికి పాపం ప్రిన్స్‌ విలియమ్స్‌ చేతిమీద మోడీ చేయి ప్రింట్‌ లాగా అయిపోయింది.

షేక్‌ హ్యాండ్‌ ముగిశాక.. మోడీతో ముచ్చట్లు నడిచే ఉంటాయి గానీ.. పాపం.. ప్రిన్స్‌ విలియమ్స్‌ తన చేతి మీద మోడీ వేళ్ల ప్రింట్‌ ను తొలగించుకోవడానికి నానా పాట్లు పడి ఉంటారేమో!
Tags:    

Similar News