గొప్ప‌లు చెప్పి మోడీ అడ్డంగా బుక్ అయ్యారా?

Update: 2019-04-25 10:39 GMT
ఇవాల్టి రోజున దేన్ని దాచ‌లేం. ఒక‌వేళ దాచాల‌న్నా దాగ‌దు. ఎవ‌రికి తెలీదులే.. గుర్తు ఉండ‌దులే అన్న ఛాన్స్ తీసుకుంటే.. న‌వ్వుల పాలు కావ‌టం మిన‌హా మరింకేమీ ఉండ‌దు. తాజాగా అలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు ప్ర‌ధాని మోడీ. బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న చాలానే ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు.

అయితే.. అందులోని కొన్ని విష‌యాల మీద నెటిజ‌న్లు ఎట‌కారం చేసుకుంటున్నారు. ఇలాంటి బ‌డాయి మాట‌లేంది మోడీ అంటూ త‌ప్పుప‌డుతున్నారు. మ‌రికొంద‌రు ఫైర్ అవుతున్నారు. ఇంత‌కీ విష‌యం ఏమంటే..  అక్ష‌య్ ఇంట‌ర్వ్యూలో భాగంగా తాను గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి అయ్యే వ‌ర‌కూ త‌న దుస్తులు తానే ఉతుక్కున్నాన‌ని చెప్పారు. దీనిపై పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్లు వ‌స్తున్నాయి.

ప్ర‌ధాని స్థానంలో ఉన్న మోడీ లాంటి వ్య‌క్తి ఇంత దారుణంగా అబ‌ద్ధాలు చెబుతారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఎంత ఎన్నిక‌లు అయితే మాత్రం ఇలాంటి జిమ్మిక్కు మాట‌ల‌కు ప‌డిపోతారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. మోడీ మాట‌ల్లో నిజం లేద‌ని.. 1970 ప్రాంతంలో మోడీ ఆర్ ఎస్ ఎస్ ప్ర‌చార‌క్ గా ఉన్న స‌మ‌యం నుంచే చాంద్ మ‌హ్మ‌ద్ అనే వ్య‌క్తి మోడీ దుస్తులు ఉతుకుతూ ఉండేవావాడని సాక్ష్యాన్ని పోస్ట్ చేస్తున్నారు.

చాంద్ మ‌హ్మ‌ద్ 2017 అక్టోబ‌రులో మ‌ర‌ణించార‌న్నారు. మోడీ ముఖ్య‌మంత్రి కావ‌టానికి మూడు ద‌శాబ్దాల ముందు నుంచే ఆయ‌న దుస్తులు వేరే వారు ఉతికేవార‌ని వెల్ల‌డిస్తున్నారు. చాంద్ మ‌హ్మ‌ద్ మ‌ర‌ణ వార్త‌కు సంబంధించిన సాక్ష్యాన్ని పోస్ట్ చేసి.. మోడీ మాట‌ల్ని చీల్చి చెండాడుతున్నారు. అయినా.. ఈ విష‌యంలో.. ఇంత పెద్ద స్థానంలో ఉండి ఇలాంటి గొప్ప‌లు చెప్పుకోవాల్సిన అవ‌స‌రం ఉందంటారా మోడీ?
Tags:    

Similar News