అమెరికాను ట్రంప్ నుంచి కాపాడేది మోడీయే!

Update: 2017-05-31 11:17 GMT
ప‌్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీకి దేశ‌విదేశాల్లో ఫాలోయింగ్ విప‌రీతంగా పెరిగిపోతోంది. దీనికి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన ఓ వీడియోనే నిద‌ర్శ‌నం. ప్ర‌స్తుతం నాలుగు దేశాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మోడీ స్పెయిన్‌లో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఆ దేశంలోని ఐబిజాలో ఓ స‌ర్వే నిర్వ‌హించారు. మోడీ ఫొటోను అక్క‌డివారికి చూపిస్తూ అందులో ఉన్న‌ది ఎవ‌రు అని ప్ర‌శ్నిస్తుంది ఓ యాంక‌ర్‌. అందుకు వాళ్లు చెప్పే స‌మాధానం వింటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.

ఈ యాంక‌ర‌మ్మ అడిగిన వారిలో చాలా వ‌ర‌కు ప్ర‌ధాన‌మంత్రి మోడీని గుర్తుపట్టారు. అంతేకాదు ఆయ‌నో ప‌వ‌ర్‌ ఫుల్ ఇండియ‌న్ లీడ‌ర్ అని కొంద‌రంటే.. యోగాను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశార‌ని మ‌రికొంద‌రు చెప్పారు. ఇక ఓ వ్య‌క్తి అయితే ట్రంప్ బారి నుంచి అమెరికాను మోడీయే కాపాడ‌తార‌ని చెప్ప‌డం విశేషం.

ఇదిలాఉండ‌గా... ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇవాళ స్పెయిన్ దేశాధ్య‌క్షుడు మారియానో రాజోయ్‌ తో భేటీ అయ్యారు. రెండు దేశాలు ద్వైపాక్షిక సంబంధాల‌పై దృష్టి పెట్టిన‌ట్లు ప్ర‌ధాని మోడీ అన్నారు. మ‌న స‌మాజానికి ఉగ్ర‌వాద‌మే పెను స‌వాల్‌గా మారింద‌న్నారు. ఉగ్ర దాడుల గురించి ఎక్కువ‌గా మాట్లాడుకోవాల్సి వస్తుంద‌న్నారు. అనేక రంగాల్లో రెండు దేశాల మ‌ధ్య స‌హ‌కారం ఉంటుంద‌న్నారు. భార‌త్‌, స్పెయిన్ మ‌ధ్య ఆర్థిక సంబంధాలు బ‌లంగా ఉన్నాయ‌ని మోడీ అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News