దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాలను ఎత్తేసే సాహస నిర్ణయం దిశగా నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వం సమాలోచనలు చేస్తుందా ? ఈ మేరకు త్వరలోనే నిర్ణయం వెలువరించనుందా ? అంటే నిజంగానే ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, నేషనల్ హైవే అథారిటీకి చెందిన అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులన్నింటి మీదా టోల్ ప్లాజాలు వెలిశాయి. సామాన్య - మధ్యతరగతి ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నా టోల్ సమర్పించుకోవాల్సిందే.
2014 ఎన్నికలలో ఎన్డీఎ కూటమి ఇచ్చిన ప్రధాన హామీలలో ఈ టోల్ గేట్లను ఎత్తివేయడం ఒకటి. టోల్ ప్లాజాల యాజమాన్యం తమకు నచ్చిన ధరను నిర్ణయించి ప్రయాణీకుల నుండి ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. ప్రతి 70 కిలో మీటర్లకు ఒక టోల్ గేట్ ఉంది. దేశవ్యాప్తంగా 434 టోల్ ప్లాజాలు ఉన్నాయి.
బైక్ లు - మూడు చక్రాల ఆటోలు మినహాయిస్తే నాలుగు చక్రాలున్న ప్రతి వాహనానికి టోల్ కట్టాల్సిందే. ఒక సారి టోల్ కడితె ఒకసారి వెళ్లి రావడానికి మాత్రమే పనికి వస్తుంది. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల మేనిఫెస్టోలో వీటిని ఎత్తేస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం వెలువడితే ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది అనడంలో సందేహం లేదు. మరి మోడీ అంత సాహసం చేస్తాడా ? లేదా ? వేచిచూడాలి.