కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గడిచిన రెండున్నరేళ్లుగా మోడీ పాలన మీదా.. మోడీ సర్కారు పైనా తీవ్రమైన వ్యాఖ్యలు చేయని రాహుల్.. తాజాగా మోడీ మీదనే నేరుగా ఆరోపణలు సంధించటం గమనార్హం.
ప్రధాని మోడీకి సంబంధించిన వ్యక్తిగత అవినీతి సమాచారం తన దగ్గర ఉందని.. తనకు అందిన సమాచారం అంతా పక్కా అని.. వాటిని వెల్లడించేందుకు తాను అవకాశం కోసంఎదురుచూస్తుంటే.. మోడీ సర్కారు తనను లోక్ సభలో మాట్లాడకుండా అడ్డుకుంటుందని వ్యాఖ్యానించారు. మోడీకి సంబంధించిన అవినీతి సమాచారం తన దగ్గర ఉండటంతో.. మోడీ అండ్ కో భయభ్రాంతులకు గురి అవుతున్నారని.. అందుకే తనను లోక్ సభలో మాట్లాడనివ్వటం లేదంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
పెద్ద నోట్ల రద్దుతో లక్షలాది మంది ప్రజల ఉపాధిని ప్రధాని ధ్వంసం చేశారని.. ఇందుకు దేశ ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలని మండిపడ్డారు. గడిచిన కొద్ది రోజుల మాదిరే ఈ రోజు (బుధవారం) కూడా లోక్ సభ సమావేశాల సందర్భంగా విపక్షాలు ఆందోళనల్ని నిర్వహించాయి. దీంతో.. సభా కార్యకలాపాలు జరగలేదు. అనంతరం సభను గురువారం నాటికి వాయిదా వేశారు. నోట్లరద్దుపై భేషరుతుగా పార్లమెంటులో చర్చకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ.. అధికారపక్ష సభ్యులే తమను అడ్డుకుంటున్నారని.. చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని రాహుల్ మండిపడ్డారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. మోడీపై ఇంత తీవ్రస్థాయిలో రాహుల్ ఆరోపణలు చేయటం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. ఇంతకీ.. మోడీకి సంబందించిన వ్యక్తిగత అవినీతికి సంబంధించిన సమాచారం రాహుల్ దగ్గర ఏం ఉన్నట్లు? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందనటంలో సందేహం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/