గడిచిన ఇరవై ఏళ్లలో దేశ ప్రధాని కుర్చీలో కూర్చున్న ప్రధానుల్లో అత్యధిక విదేశీ పర్యటనలు చేసిన ప్రధానిగా తిరుగులేని స్థానంలో నిలుస్తారు నరేంద్ర మోడీ. ఉద్యమస్ఫూర్తితో అత్యధిక విదేశీ పర్యటనలు చేయటమే కాదు.. కొన్ని సందర్భాల్లో విమానంలోనే రెస్ట్ తీసుకునేలా ఓవర్ నైట్ జర్నీలతో ప్రపంచంలోని పలు దేశాల్ని సందర్శించిన రికార్డు మోడీ సొంతం.
మరి.. అలాంటి మోడీ.. పలువురు దేశాధినేతలతో క్లోజ్ గా మూవ్ కావటమే కాదు.. వారికి తనదైన ఆత్మీయ ఆలింగనంతో మరిసిపోయేలా చేస్తుంటారు. చివరకు అగ్రరాజ్య అధినేతలు సైతం మోడీకి ప్రయారిటీ ఇస్తున్నట్లుగా వార్తలు రావటం తెలిసిందే. మరి.. ఈ మాటలకు.. చేతలకు మధ్య వ్యత్యాసాన్ని తేల్చిందో తాజా అధ్యయనం ఒకటి.
తాను భేటీ అయిన దేశాధినేతలతో భిన్నరీతిలో వ్యవహరించే మోడీ.. అగ్రరాజ్యాలైన అమెరికా.. రష్యా అధినేతల దగ్గర అంత ప్రాధాన్యత లేదన్న విషయం తాజా గణాంకాలు స్పష్టం చేయటం గమనార్హం
రూటర్స్ డేటా ప్రకారం జనవరి 2017లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి 2018 జులై 6 వరకు మొత్తం 40 మంది దేశాధినేతలకు ఫోన్స్ చేసినట్లుగా పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ఫోన్ కాల్స్ దాదాపు 200 వరకూ ఉంటాయని తేలింది. అమెరికా అధ్యక్షుడి కాల్ డేటా లెక్కలు ఇలా ఉంటే.. రష్యా అధినేత వాద్లిమర్ పుతిన్ విషయానికి వస్తే.. ఇదే కాలంలో (జనవరి 2017నుంచి జులై 6 - 2018 మధ్యన) ఆయన 50 దేశాల అధినేతలకు 190 వరకూ ఫోన్ కాల్స్ చేసినట్లు తేలింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ట్రంప్ ఫోన్ కాల్స్ ఎక్కువగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రోన్ కు ఎక్కువగా ఉంటే.. తర్వాతి స్థానం బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. బ్రిటన్ ప్రధాని థెరిసా స్థానం తర్వాత జపాన్ ప్రధాని కి ఎక్కువగా ఫోన్ కాల్స్ చేసినట్లుగా తేలింది.
మరోవైపు పుతిన్ ఫోన్ కాల్స్ ను విశ్లేషిస్తే.. ఆయన ఎక్కువగా టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ కు 27 ఫోన్ కాల్స్ ఉండగా కజకిస్థాన్ అధ్యక్షుడు తర్వాతి స్థానంలో ఫ్రాన్స్.. జర్మనీ.. ఇజ్రాయెల్ దేశాధినేతలకు ఆయన ఫోన్లు ఎక్కువగా చేసినట్లు తేలింది.
ట్రంప్ తో పాటు పుతిన్ తోనూ కలుపుగోలుగా ఉండే మోడీ విషయానికి వస్తే విస్మయకర అంశాలు వెలుగు చూస్తున్నాయి. ట్రంప్.. పుతిన్ ఫోన్ కాల్స్ డేటాలో మోడీకి ఇస్తున్న ప్రాధన్యత ఏమీ లేదన్న షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఈ ఇద్దరు దేశాధినేతలు మోడీకి చేసిన ఫోన్ కాల్స్ సింగిల్ డిజిట్ ను దాటకపోవటం చూస్తే.. రెండు అగ్రదేశాధినేతలతో మోడీకి ఉన్న పరిచయం నామాత్రంగా చెప్పక తప్పదు. చూస్తుంటే.. తనను కలిసే విదేశీ ప్రములకు ఆత్మీయంగా మోడీ ఇచ్చే హగ్ ఎలాంటి ప్రభావాన్ని చూపించటం లేదన్న మాట.