చిన్న, సన్నకారు రైతుల కోసం పనిచేయడాన్ని తాము గౌరవంగా భావిస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. ఏడేళ్లుగా వారి కోసం భూసార పరీక్షల కార్డులు, ఇతర కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోడీ స్పష్టం చేశారు. . వ్యవసాయ రంగంలో మధ్యవర్తులపై ఆధారపడకుండా రైతుల గౌరవాన్ని కాపాడుతూ వారి శ్రేయస్సుకు పాటుపడుతున్నామని మోడీ అన్నారు.
సాగురంగానికి ఓ రూపు తీసుకురావాలన్నదే బీజేపీ ప్రభుత్వ ధ్యేయమని మోడీ తెలిపారు. అందుకే కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని మోడీ ప్రకటించి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.