ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఈమధ్య కాలంలో భిన్నమైన పరిస్థితులు అనుభవంలోకి వస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మోడీ ఒంటిచేత్తో బీజేపీని విజయతీరాలకు చేర్చారు. ఈ క్రమంలో ఎన్డీఏలో అప్పటికే భాగస్వామ్యంగా ఉన్న పార్టీలే కాకుండా ఇతర పార్టీలు కూడా బీజేపీకి సన్నిహితంగా మారాయి. అయితే సార్వత్రిక విజయం తర్వాత మోడీ ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత కొద్దికాలానికి జరిగిన బీహార్ లో వైఫల్యం మోడీకి ఎదురుదెబ్బగా మారింది. ఈ క్రమంలో మిత్రపక్షాలు తమ అసంతృప్తిని వెళ్లగక్కడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ముందువరుసలో నిలిచిన పార్టీ మరాఠాలకు ప్రతీకగా నిలిచే శివసేన.
మోడీకి ఇబ్బందికరంగా ఉన్న ప్రతి సందర్భంలోనూ తమదైన శైలిలో విరుచుకుపడటంలో శివసైనికులు ముందంజలో నిలిచారు. పేరుకు మిత్రపక్షమైనా శివసేన అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించిన సందర్భాలే ఎక్కువ. శివసైనికులు ఆమడదూరం ఉంచే పాకిస్తాన్ విషయంలో మోడీ తాజాగా వ్యవహరించిన తీరును వ్యంగ్యంగా ప్రశ్నిస్తూ శివసేన ఎద్దేవా చేసింది.
పారిస్ లో జరిగిన వాతావరణ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో కరచాలనం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో నరేంద్ర మోడీ ఆదర్శప్రాయమైన సహనాన్ని ప్రదర్శించారని శివసేన అధికారిక పత్రిక సామ్నా వ్యంగ్యంగా పేర్కొంది. ఎదుటి వారు చేయెత్తితే మనం చేతులు ముడుచుకుని కూర్చోవడమే సహనమైతే....ప్రధాని నరేంద్ర మోడీ ఆ సహనాన్ని అద్భుతంగా ప్రదర్శించారని పేర్కొంది. మన దేశ సైనికులను చంపేస్తున్న ఉగ్రవాదులకు ఊతం ఇస్తున్న దేశ ప్రధానితో కరచాలనం చేయడం సహనం కాదా అని ప్రశ్నించింది. అసహనం అంటూ ఎవరూ దేశం విడిచి వెళ్లక్కరలేదనడానికి ఇంత కన్నా నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించింది.
మొత్తంగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో కరచాలనం చేయడం ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోడీని ఎద్దేవా చేస్తూనే దేశంలోని అసహనం అంశంలో శివసేన తనదైన శైలిలో భరోసా ఇవ్వడం ఆసక్తికరం.