ప్రధాని నరేంద్రమోడీ కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. వారణాసిలోని తన లోక్‌సభ నియోజకవర్గంలో ఫ్రంట్‌లైన్ కార్మికులతో ఆన్ లైన్ వీడియోకాల్ ద్వారా సంభాషించేటప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా మోడీపై సెటైర్లు వేశారు. దేశంలో టీకాలు లేవని.. కోవిడ్ తో మరణాల సంఖ్య అత్యధికంగా ఉందని.. ప్రభుత్వ స్పందన ఏం లేదని.. ఓవైపు ప్రధాని మాత్రం ఏడుస్తున్నాడని రాహుల్ ఎద్దేవా చేశారు.
"టీకాలు లేవు, తక్కువ జిడిపి, అత్యధిక కోవిడ్ మరణాలు ... భారత ప్రభుత్వం స్పందన ఏదీ? పీఎం ఏడుస్తున్నాడు" అని రాహుల్ గాంధీ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు. ఒక నివేదికను రాహుల్ జతచేశాడు, ఇది భారతదేశ స్థూల జాతీయోత్పత్తి -8 శాతం అని తెలిపారు. ఇక ఒక మిలియన్ జనాభాకు కోవిడ్ కారణంగా దేశంలో 212 మరణిస్తున్నారని మోడీ సర్కార్ వైఫల్యాలను ఎత్తి చూపారు..
దేశంలో సెకండ్ వేవ్ ఇంత దారుణంగా పరిణామాలు చవిచూశాక. మోడీ తీరికగా కోవిడ్ -19 కు మరణించిన వ్యక్తుల మరణాలను ఖండించారని రాహుల్ గాంధీ విమర్శించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మోడీ సర్కార్ తీరు ఉందని విమర్శలు గుప్పించారు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో భారతదేశంలో 4,194 మరణాలు, 2.57 లక్షల తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయి.కరోనా సెకండ్ వేవ్ తో చాలా మంది ఆస్పత్రుల పాలవుతూ బెడ్స్ కొరత, ఆక్సిజన్ లేమితో ఇబ్బందులు పడుతున్నారు. మరణాల సంఖ్య తీవ్రంగానే ఉంది.