తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. ఆగస్టు 7న రానున్న మోదీ పర్యటన కార్యక్రమాలు ఖరారు చేస్తూ పీఎంవో నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందింది. పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రధానమంత్రి ఇదే క్రమంలో తెలంగాణ సీఎం చేపట్టనున్న సుదర్శనయాగానికి ముఖ్య అతిథిగా హాజరుకానుండటం విశేషం.
ప్రభుత్వానికి అందిన సమాచారం ఈ విధంగా ఉంది. ఢిల్లీ నుంచి ఆగస్టు 7న మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రత్యేక విమానంలో ప్రధానమంత్రి బేగంపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.45కి ప్రత్యేక హెలికాప్టర్ లో కరీంనగర్ జిల్లా రామగుండం చేరుకోనున్నారు. అక్కడ థర్మల్ విద్యుత్ ప్లాంట్ - ఎఫ్ సీఐకి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2.25కి ఆదిలాబాద్ జిల్లా జైపూర్ కు చేరుకుంటారు. జైపూర్ లోని థర్మల్ విద్యుత్ ప్లాంట్ ను జాతికి అంకితం చేయనున్నారు. తిరిగి 3.10కి వరంగల్ చేరుకొని కాకతీయ టెక్స్ టైల్స్ పార్క్, కాళోజి హెల్త్ వర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మిషన్ కాకతీయ పైలాన్ ను ప్రధానమంత్రి ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 4.10కి గజ్వేల్ కు చేరుకుంటారు. ఆ తర్వాత మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం గజ్వేల్ లో నిర్వహించే బహిరంగసభకు హాజరవుతారు. ఇదే సందర్భంగా కేసీఆర్ నిర్వహించే యాగానికి హాజరుకానున్నారు. అనంతరం అదేరోజు సాయంత్రం ఆరు గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళతారు. ప్రధాని తొలిసారి రాష్ట్ర పర్యటనకు వస్తుండటంతో భారీ ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.