ఏపీ అసెంబ్లీని చూస్తే మోడీకి అసూయ తప్పదా?

Update: 2017-02-03 06:38 GMT
ఏపీ రాజధానిలో ఇప్పుడున్నదంతా తాత్కాలికమే. తక్షణ అవసరాల్ని తీర్చేలా తాత్కాలిక సచివాలయాన్ని ఏర్పాటు చేసుకున్న వెలగపూడిలోనే.. అసెంబ్లీ.. శాసనమండలిని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఆవరణ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి అయినట్లే. ఫినిషింగ్ టచ్ లు ఇప్పుడు ముమ్మరంగా సాగుతున్నాయి.  ఈ అసెంబ్లీ భవనాన్ని ప్రధాని మోడీ చేత ప్రారంభించాలన్న ఆలోచనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు.

మరి.. ఆయన ప్రయత్నాలు  సఫలమవుతాయా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్న. అయితే.. ఇప్పటివరకూ సిద్ధమైన ఏపీ అసెంబ్లీని చూసిన వారు.. దీని ప్రారంభోత్సవానికి కానీ ప్రదాని మోడీ వస్తే.. కుళ్లుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ప్రతి పనిలోనూ తన క్రెడిట్ పక్కాగా ఉండాలని ఫీలయ్యే మోడీ లాంటి నేతకు.. తాను పెద్దగా సహకారం అందించకున్నా.. తమకు తాముగా తయారు చేసుకుంటున్న అసెంబ్లీలాంటి భవనాల్ని చూస్తే కళ్లు కుట్టటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

తాజాగా నిర్మిస్తున్న ఏపీ అసెంబ్లీలో ప్రత్యేకతలు అన్నిఇన్ని కావని చెబుతున్నారు. అత్యాధునిక రీతిలో సిద్ధం చేస్తున్న ఏపీ అసెంబ్లీ విశేషాల పుట్టగా చెబుతున్నారు. కళ్లు చెదిరిపోయే హంగులతో సిద్ధం చేస్తున్న అసెంబ్లీలో స్పీకర్ పోడియం మొదలు.. సభ్యుల సీటింగ్ వరకూ అన్ని ప్రత్యేకతలనని చెబుతున్నారు. భవననిర్మాణం కోసం జర్మనీ నుంచి అత్యాదునిక పరికరాలను తెప్పించారు. ఇక.. ప్రతి అసెంబ్లీలో కనిపించే సీన్ రానున్న రోజుల్లో అమరావతి అసెంబ్లీలో కనిపించే అవకాశమే లేదని చెబుతున్నారు.

సభ్యులకు ఎంత కోపం వచ్చినా.. మైకును ఏమీ చేయలేరని.. గతంలో మాదిరి ఏం పడితే అది అనేసి.. తర్వాతఏమీ అనలేదంటూ బుకాయించే తీరుకు అవకాశం లేదని చెబుతున్నారు. ఎందుకంటే.. మైకు.. వాయిస్ రికార్డర్ తో  కలిసి టేబుల్ లోపల ఫిక్స్ చేసేలా రూపొందించారు. అంతేకాదు.. అధికారపక్షంపై నిరసన తెలిపేందుకు స్పీకర్ పోడియం వద్దకు సభ్యులు దూసుకెళ్లటం.. పోడియం మీదకు ఎక్కటం లాంటివి చేస్తుంటారు. కానీ.. ఏపీ అసెంబ్లీలో ఇప్పుడు అలాంటి అవకాశమే లేకుండా ఏర్పాట్లు చేయటం విశేషం. మరిన్ని హంగులున్న అత్యాధునిక అసెంబ్లీని చూస్తే.. మోడీ అసూయ పడకుండా ఉంటారా..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News