తన టీమ్ పట్ల ప్రధాని నరేంద్ర మోడీ అసంతృప్తిలో ఉన్నారా? వారి పని తీరు మరింత మెరుగుపడాలని భావిస్తున్నారా? మిగిలిన వారిని అలెర్ట్ చేసేందుకు వీలుగా కొందరిపై వేటు వేయాలని భావిస్తున్నారా?లాంటి ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. మోడీ తన మంత్రివర్గ సబ్యుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేంద్ర క్యాబినెట్ లో మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారని.. ఇందుకు త్వరలోనే ముహుర్తం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. పాతవారిని సాగనంపి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్నా ఆలోచనలో మోడీ ఉన్నట్లు చెబుతున్నారు.
మరోవైపు అధికార బీజేపీకి సంబంధించి అధ్యక్షుడిగా పదవీకాలం పూర్తి అయిన అమిత్ షా మరోసారి పార్టీ పగ్గాల్ని చేపట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. తాజాగా వినిపిస్తున్న అంచనా ప్రకారం హోం.. ఆర్థిక.. రక్షణ.. విదేశాంగ విధానం మినహా మిగిలిన శాఖలకు సంబంధించి మార్పులుచేర్పులకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక.. మోడీ టీంకు సంబంధించి వేటు పడే అవకాశం ఉన్న మంత్రుల విషయానికి వస్తే..ఇటీవల జరిగిన పలు పరిణామాల్ని పరిగణలోకి తీసుకోనున్నట్లు చెబుతున్నారు. అదేసమయంలో.. రానున్న కొద్ది నెలల వ్యవధిలో పలు రాష్ట్రాల్లో (తమిళనాడు.. కేరళ.. పశ్చిమ బెంగాల్.. పుదుచ్చేరి.. అసోం) అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే.. వచ్చే ఏడాది దేశంలో అతి పెద్దరాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మార్పులు జరిగే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
వీరిపై వేటు పడుతుందా?
= రవిశంకర్ ప్రసాద్
= రాధా మోహన్ సింగ్
= ధర్మేంద్ర ప్రధాన్
= సుజనా చౌదరి