ఏదైనా కార్యక్రమంలో పాల్గొనటానికి మీ ఊరి ఎమ్మెల్యే బజార్లోకి వస్తుంటే ఎంత హడావుడి ఉంటుందో గుర్తుకు చేసుకోండి. ఇక.. కలెక్టర్లు.. ఎస్సీలు లాంటి అధికారులు.. మంత్రులు లాంటి వారు రోడ్ల మీద వెళుతుంటే.. వారి వాహనాలకు దారి ఇచ్చేందుకు సాధారణ జీవుల్ని పోలీసులు ఎంతగా ఇబ్బంది పెడతారో గుర్తుకు తెచ్చుకోండి. కానీ.. ఇలాంటి వాటికి భిన్నంగా వ్యవహరిస్తుంటారు ప్రధాని మోడీ.
సామాన్యుడి మనసుల్ని దోచుకోవటం మోడీకి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదు. అధికారం.. దర్పం.. హోదాను ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ మాత్రమే చూపించే మోడీ.. చాలా సందర్భాల్లో సాదాసీదాగా వ్యవహరిస్తూ వార్తల్లో నానటమే కాదు.. ప్రజల హృదయాల్లో తన ముద్రను ఎప్పటికప్పుడు వేస్తుంటారు. తాజాగా అలాంటి పనే చేసి.. మరోసారి వార్తల్లో ప్రముఖంగా దర్శనమిచ్చారు.
ఓపక్క తమ మిత్రపక్షానికి చెందిన ఎంపీ.. ఫ్లైట్లో రాచమర్యాదలు చేయని కారణంగా.. ఇష్టారాజ్యంగా వ్యవహరించటమే కాదు.. రచ్చ రచ్చ చేసిన వైనం ఓపక్క హాట్ టాపిక్ గా మారగా.. తాను మాత్రం అలాంటి వాటికి అస్సలు ప్రాధాన్యత ఇవ్వనన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేశారు ప్రధాని మోడీ తన తాజా చర్యతో.
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా నాలుగురోజుల భారత్ పర్యటనతో భాగంగా ఢిల్లీకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆమెకు స్వాగతం పలికేందుకు ప్రధాని మోడీ ఎయిర్ పోర్ట్కు వెళ్లారు. మామూలుగా అయితే.. ఇలా రోడ్ల మీదకు ప్రధాని స్థాయి వ్యక్తి వెళ్తుంటే.. ట్రాఫిక్ ఆంక్షలు విధించటం చాలా కామన్. కానీ.. మోడీ మాత్రం అందుకు భిన్నంగా ప్రోటోకాల్ పక్కన పెట్టేసి.. ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్ నుంచి ఇందిరాగాంధీ ఎయిర్ పోర్ట్ వరకూ ఎలాంటి ఆంక్షలు లేకుండా సాధారణ ట్రాఫిక్ లో ప్రయాణించటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ప్రధాని స్థాయి వ్యక్తి.. అందునా మోడీ లాంటి మోస్ట్ పవర్ ఫుల్ పర్సనాలిటీ.. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా సాదాసీదాగా ప్రయాణించటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/