700 కోట్లు.. మోడీకి ఎందుకు ఖర్చు పెట్టారో తెలిస్తే.. గుండెలు బాదుకుంటారు!
ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా.. 1700 కోట్ల రూపాయలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంచి నీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు. అది కూడా ఈ రెండేళ్ల కాలంలోనే! అంటే.. రెండు ఆర్థిక సంవత్సరాల్లో అన్నమాట. మరి ఈ సొమ్మును ఏమన్నా..కరోనా బాధితులకు ఇచ్చారా? లేక.. ఆక్సిజన్ కోసం.. ఖర్చు చేశారా? అంటే.. అదేమీ లేదని.. నిస్సందేహంగా చెప్పేశారు. మరి ఎందుకు ఖర్చు చేశారు? అంటే.. తమ ప్రభుత్వం ఈ రెండేళ్ల కాలంలో సాధించిన విజయాలపై ప్రకటనలు, ప్రచారం కోసం ఖర్చు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వివరించారు.
నిజానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై ఒక మంచి మాట అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. ఒక్క రూపాయి ఖర్చు చేయాలన్నా.. కూడా ఆచి తూచి అడుగులు వేస్తారని.. ప్రజాధనానికి పూచీ కత్తుగా మాత్రమే తాము ఉంటామని.. ఎక్కడా వృథా గా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయమని.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ ఘంటా పథంగా చెబుతుంటారు. అంతేకాదు.. జీఎస్టీ.. బకాయిలు ఇప్పించండి సారూ! అని రాష్ట్రాలు మొరపెట్టుకున్నా.. డబ్బులకు ఇబ్బందిగా ఉంది. పైగా కరోనాతో ఆర్థిక వ్యవస్థ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటోందో తెలుసుకదా! అని ఎదురు ప్రశ్నలు సైతం సంధిస్తారు.
సో.. దీనినిబట్టి ప్రజాస్వామ్య వాదులు.. అందరూ.. కూడా మోడీ చేతిలో ప్రజా ఖజానాకు మంచి రక్షణ ఉంటుందని భావిస్తారు. కానీ, తాజాగా పార్లమెంటులో మోడీ ప్రభుత్వం వెల్లడించిన వివరాలు చూస్తే.. సగటు మనిషి గుండెలు చిక్కబట్టుకోవాల్సిందే! అంటున్నారుపరిశీలకులు. ఎందుకంటే.. కేవలం 22 నెల్లలో(రెండేళ్లకు రెండు నెలలు తగ్గించి) 1700 కోట్ల రూపాయలను కేంద్రంలోని మోడీ సర్కారు కేవలం తన ప్రచారానికి, ప్రకటనలకు వినియోగించుకుంది. 2018-19, 2020-21 మధ్య వివిధ న్యూస్ పేపర్లకు, న్యూస్ ఛానెళ్లకు మోడీ ప్రచారం నిమిత్తం 1698.98 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టు పార్లమెంటులో స్పష్టం చేసింది.
ఇక్కడ చిత్రం ఏంటంటే.. పార్లమెంటులో అన్ని వార్తలను కవర్‌చేసే .. మీడియా.. దీనిని మాత్రం ఎస్కేప్ చేసింది. సరే! ఇదిలావుంటే.. కేంద్ర ప్రబుత్వం కూడా అప్పుల్లోనే ఉందని.. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చెప్పారు. దేవ జీడీపీలో 59.2 శాతం అప్పులేనని ఆయన సంచలన విషయాన్ని పార్లమెంటుకు చెప్పారు. అదేసమయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అప్పులు 31.1 శాతానికి చేరాయని వివరించారు. అంటే.. రాష్ట్రాల కంటే కూడా కేంద్రమే అప్పులు చేస్తున్నట్టు స్పష్టమైందని విపక్షాలు రాగం తీయడం గమనార్హం.