నరేంద్రమోదీ మాటలు చెప్పడంలో దిట్ట. సభా రంజకంగా రక్తి కట్టించే మాటలతో ఎంతటివారినైనా మాయ చేయగలరు. సమ్మోహన పరచగలరు. కట్టిపడేయగలరు. అలాంటి మోడీ ఇప్పుడు పురాణ పురుషుడు రాముడిని కూడా విడిచిపెట్టడం లేదు. కాకపోతే ఆయనను వచ్చే ఎన్నికలకు వాడుకోవాలని స్కెచ్ వేసినట్లుగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అయోధ్యలో రామాలయం అంశం మీదనే ప్రజల ముందుకు వెళ్లబోతున్నట్లుగా మోడీ ప్రకటించారు.
మోడీ మాయాజాలం రాముడికి కూడా తప్పేలా లేదు. మోడీ గత ఎన్నికల సమయంలో విదేశాల్లో ఉన్న నల్ల ధనాన్ని వెనక్కి తెచ్చి - దేశప్రజలు ఒక్కొక్కరి ఖాతాల్లో 15 లక్షల వంతున వేస్తా అని చెప్పారు. ఆ మాటలు కల్లలే అని తేలిపోయాయి. స్వదేశంలో ఉన్న నల్ల ధనాన్ని వెలికి తీస్తా అని ప్రకటించి చాలా రాద్దాంతం చేశారు. ప్రాణాలు పోయాయి తప్ప నల్లధనం వెలికి వచ్చిన దాఖలాలు మాత్రం లేవు.
అలాగే తెలుగు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పి... చెప్పి మరొక వంచనకు పాల్పడ్డారు. ఇలా ఎన్నికల ముందు ఒక మాట చెప్పడం ఎన్నికల్లో తన పబ్బం గడిచేలాగా అడ్డంగా వాడుకోవడం అనేది మోడీ కి వెన్నతో పెట్టిన విద్య లాగా మారిపోయింది.
తాజాగా ఆయన వచ్చే ఎన్నికలకు అయోధ్య రాముడిని కూడా వాడుకోవాలని డిసైడ్ అయినట్లు ఉంది. ఒకప్పట్లో రాముడి పెరు చెప్పుకుని బీజేపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి వారు అయోధ్య రాముడి కోసం చేసింది ఇప్పటిదాకా ఏమీ లేదు. కొత్తగా మళ్లీ అదే రాముడిని వాడుకోవాలని చూస్తున్నారు. మోడీ రాముడిని కూడా మోసం చేయడానికి సిద్ధపడిపోయాడని ప్రజలు అనుకుంటున్నారు. అయోధ్య రామాలయం నిర్మాణ విషయంలో మోడీకి ఏమైనా చేయాలనే చిత్త శుద్ధి ఉంటే గనుక ఇప్పుడే చేయవచ్చు కదా.. ఇప్పుడు అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో వారి పార్టీనే ఉన్నది కదా.. ఇప్పుడేమీ చేయకుండా, ఈసారి ఎన్నికల తరువాత చేస్తా అని చెప్పడమే పెద్ద వంచన అని పలువురు అంటున్నారు.