ఏపీ మీద బీజేపీ చూపు పడింది. వరసబెట్టి అనేక మంది నాయకులు ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ మధ్యనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో రెండు రోజుల పాటు పర్యటించారు. ఇక కేంద్ర మంత్రులు కూడా ఒకరి తరువాత ఒకరు ఏపీ టూర్లు చేస్తున్నారు. విదేశాంగ మంత్రి జై శంకర్ విశాఖ ఏజెన్సీలో పర్యటించి అక్కడ గిరిజనులతో మమేకం అయ్యారు. అలాగే మరో కేంద్రమంత్రి పూరీ కూడా విశాఖలో రెండు రోజుల టూర్ చేశారు.
ఇపుడు ప్రధాని నరేంద్ర మోడీ వంతు. ఆయన వచ్చే నెల అంటే జోలై 4న ఏపీలో పర్యటించే షెడ్యూల్ ఖరారు అయింది. జూలై 4న స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి. దాంతో అజాదీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా అల్లూరికి కేంద్రం ఘన నివాళి అర్పిస్తోంది. ఈ క్రమంలో అల్లూరి నడయాడిన ప్రాంతాలను స్వయంగా ప్రధాని మోడీ సందర్శిస్తారు.
జూలై 4న ప్రధాని మోడీ భీమవరం విశాఖ టూర్లు చేపడుతున్నారు. ముందుగా భీమవరం రానున్న ప్రధాని అక్కడ జరిగే అల్లూరి జయంతి ఉత్సవాలలో పాలు పంచుకుంటారు. ఆ తరువాత విశాఖ జిల్లా వస్తారు.
అల్లూరి స్వస్థలం విశాఖ జిల్లా భీమిలీ నియోజకవరం పద్మనాభం మండలం పాండ్రంకి. అలాగే అల్లూరి విశాఖ జిల్లా చింతపిల్లి అడవులలలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఈ సాయుధ పోరాటంలో భాగంగా ఆయన కొయ్యూరులో చనిపోయారు.
దాంతో అల్లూరి జీవితం మొత్తం విశాఖ జిల్లాల్తో ముడిపడిఉంది. అల్లూరి జయంతి ఉత్సవాలను అందువల్లనే విశాఖ జిల్లాలో నిర్వహించాలని అల్లూరి అభిమానులతో పాటు అంతా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీంతో ప్రధాని విశాఖ జిల్లా పర్యటన పెట్టుకున్నారు. ఆ రోజున విశాఖలో ఆయన ఒక బహిరంగ సభలో పాలుపంచుకుంటారు.
మొత్తానికి ఒకే రోజు భీమవరం విశాఖలలో ప్రధాని మోడీ టూర్ ఉంటుంది అన్న మాట. పైగా విప్లవవీరుడు అల్లూరి పేరిట జరిగే కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా ఆయన ఆంధ్రుల గుండె తలపుని తడతారు. అల్లూరి బాణంతో ఏపీలో బీజేపీ విస్తరణకు గురి పెడతారు అంటున్నారు. దాదాపు మూడేళ్ళ కాలం తరువాత విశాఖ వస్తున్న ప్రధాని అక్కడ ఏం మాట్లాడుతారు, ఏం చెబుతారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.