దేశ రాజకీయాల్లో తనదైన శైలిలో ముదుకువెళుతూ ప్రత్యేకతను చాటుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గట్టి సవాల్ ఎదురైంది. మావోయిస్టుల కంచుకోటగా ఉన్న దంతెవాడలో అడుగుపెట్టి అభివృద్ధి కార్యక్రమాలతో ఈ ప్రాంత రూపురేఖలు మార్చేందుకు సిద్ధపడ్డ మోడీకి ఆయన పర్యటన సమయంలోనే గడ్డు పరిస్థితి ప్రారంభమైంది.
చత్తిస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా మారంగి అనే గ్రామానికి వచ్చిన మావోయిస్టులు వందలాదిమంది గిరిజనులను అపహరించుకుపోయారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చత్తిస్‌గఢ్‌లోని దంతెవాడకు బయలుదేరుతున్న సమయంలోనే వందలాదిమంది గిరిజనులను తమ చెరలో ఉంచుకోవడంతో పాటు కాకునూరు రైల్వే స్టేషన్ సమీపంలో నక్సలైట్లు రైలు పట్టాలు తొలగించారు. ఈ సంఘటన చత్తిస్‌గఢ్‌లో సంచలనం సృష్టించింది.
నక్సలైట్ల సమాంతర ప్రభుత్వానికి కేంద్రంగా మారిన దంతెవాడ, ఆ సమీపంలో యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో దంతెవాడ పరిధిలోని దిల్మిలి గ్రామంలో ఏర్పాటు చేయబోతున్న అతి భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి అవగాహన ఒప్పందం కుదుర్చుకోబోతున్నారు. అలాంటి ప్రాంతంలో పర్యటించి అక్కడే ఎంఓయూ కుదుర్చుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సిద్ధమయ్యారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.18 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఈ ప్రాజెక్టులో 10 వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని అంచనా. దీంతో పాటే గతంలో ఆగిపోయిన రోఘాట్-జగదల్‌పూర్ రైల్వైలైన్ రెండో దశ పనులకు శంకుస్థాపన చేసేందుకు సిద్ధమయ్యారు. 140 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గాన్ని రూ.24వేల కోట్లతో నిర్మిస్తారు. అంతే కాకుండా, ఐదు వేల మంది అట్టడుగు వర్గాల పిల్లల కోసం రూ.120 కోట్లతో 100 ఎకరాల్లో నిర్మించిన ఎడ్యుకేషన్ సిటీని మోడీ సందర్శించడం మోడీ షెడ్యూల్్ ఉంది. యువతకు ఉద్యోగావకాశాలు పెంపొందించేందుకు గాను ఏర్పాటు చేసిన లైవ్‌లీహుడ్ కాలేజీకి వెళతారని అధికారులు తెలిపారు.