అగ్రరాజ్యం అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు అతి త్వరలో రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రహ్మండమైన రోడ్ షోకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోడ్ షో దాదాపు గా 22 కిలో మీటర్ల పొడవునా సాగబోతోంది. ఈ రోడ్ సాగే దారి పొడవునా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సుమారు 50వేల మందికి పైగా జనం ఇరు వైపులా నిలబడి తమ సంప్రదాయ ఆహార్యంలో కనిపిస్తారని అహ్మదాబాద్ మేయర్ బిజాల్ పటేల్ తెలిపారు. ఈ నెల 24వ తేదీన ట్రంప్, ప్రధాని మోడీతో కలిసి ఈ రోడ్ షో లో పాల్గొననున్నారు.
ఈ రోడ్‌షో ద్వారా ట్రంప్–మోదీలు సబర్మతీ ఆశ్రమం చేరుకోనున్నారు. ఆ తరువాత, ఇద్దరూ కలసి మొతెరాలో నిర్మించిన ప్రపంచం లోని అతి పెద్ద క్రికెట్ స్టేడియాన్నిచేరుకొని , స్టేడియంని ప్రారంభించనున్నారు. ఆతరువాత మోదీ, ట్రంప్‌లు కలసి మొతెరాలో బహిరంగ సభలో ట్రంప్, మోడీలు కలిసి ప్రజలను ఉద్ధేశించి మాట్లాడనున్నారు. 22 కిలో మీటర్ల పొడవున ప్రజలు నిలబడే పెద్ద రోడ్ షో దేశంలో ఇదే కావచ్చని బిజాల్ పటేల్ చెప్పారు.