వైసీపీలోకి మోదుగుల వేణుగోపాలరెడ్డి?

Update: 2018-10-06 06:51 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో వైసీపీ గాలి జోరుగా వీస్తోంది. సర్వేలన్నీ వైసీపీ విజయం సాధిస్తుందని ఢంకా బజాయించి చెబతుండగా టీడీపీలో టెన్షన్ మొదలైంది. అంతేకాదు... టీడీపీ కోసం చొక్కాలు చించుకున్నా ఆ పార్టీ ఏమాత్రం పట్టించుకోకుండా విడిచిపెట్టిన నేతలు కూడా ఇప్పుడు సరైన దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
   
రాష్ర్ట విభజన సమయానికి మోదుగుల టీడీపీ ఎంపీగా ఉన్నారు. పార్లమెంటులో ఆయన విభజనకు వ్యతిరేకంగా గట్టిగానే పోరాడారు. కానీ, 2014లో ఆయన్ను టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయించింది. ఆయనకు మంత్రి పదవి ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోగా పూర్తిగా పక్కనపెట్టారు. దీంతో చాలాకాలంగా ఆయన అంసతృప్తిగా ఉన్నారు.
   
ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మోదుగులకు టీడీపీలో టిక్కెట్ దక్కడం కూడా కష్టమేనన్న మాట వినిపిస్తోంది. మోదుగుల కూడా ఇప్పటికే ఈ విషయం అర్థం చేసుకున్నారని... ఆయన పార్లమెంటుకు వెళ్లాలని అనకుంటున్నారని అనుచరులు అంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారట. టీడీపీలో ఆ అవకాశం లేకపోవడంతో ఆయన వైసీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం.
Tags:    

Similar News