కేసీఆర్ ను అమరజీవితో పోల్చేసిన ‘‘బాబు’’

Update: 2016-02-09 05:33 GMT
కొద్దికాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూనే.. అప్పుడప్పుడు రాజకీయ వ్యాఖ్యలు చేయటం ప్రముఖ నటుడు మోహన్ బాబుకు అలవాటే. ఆసక్తికర వ్యాఖ్యలు చేసే ఆయన తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తూ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. గ్రేటర్ ఎన్నికల్లో 99 స్థానాల్లో టీఆర్ ఎస్ విజయం సాధించిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రిని అభినందించిన మోహన్ బాబు.. ఆయన్ను ఏపీ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన పొట్టిశ్రీరాములతో పోల్చటం విశేషం.

ఏపీ రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాముల తరహాలోనే.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని.. ఆయన చేసిన పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటూ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఉన్నట్లుండి కేసీఆర్ ను మోహన్ బాబు అంతలా పొగిడేయటం ఏమిటో..?
Tags:    

Similar News