కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆసక్తికర ప్రకటన చేశారు. త్వరలో క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నట్లు ఆయన ప్రకటించారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ తాను ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు - ప్రతిపక్ష నేత జగన్ ఇద్దరూ తనకు బంధువులేనని అన్నారు. ప్రజాప్రతినిధులు - అధికారుల అవినీతిని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తో సత్సంబంధాలు ఉన్న మోహన్ బాబు ఆయన పార్టీ స్థాపించిన సమయంలో సత్సంబంధాలు కొనసాగించారు. అనంతర పరిణామాల్లో చంద్రబాబుతోనూ సఖ్యతగా ఉన్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనతో ఒకింత ఎడం పాటించారు. ఇదే సమయంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుమార్తెతో తన పెద్ద కుమారుడు మంచు విష్ణుకు వివాహం జరిగిన నేపథ్యంలో వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. ఇప్పటికీ వైఎస్ ఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోహన్ బాబు తాజా ప్రకటన ఆసక్తిని కలిగిస్తోంది.