రాష్ట్ర విభజన కారణంగా ఏపీకి ఎంతో నష్టం వాటిల్లిందన్న విషయం తెలిసిందే. విభజన కారణంగా నష్టం జరిగినట్లే కొన్ని అంశాల్లో లాభం జరిగిందన్న మాట వినిపిస్తోంది. విశాఖపట్నంలోని హోటల్ రంగానికి చూస్తే.. విభజన కారణంగా వైజాగ్ స్టార్ తిరిగిపోయిందని చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అందరి దృష్టి హైదరాబాద్ మీదనే ఉండేది. కానీ.. విభజన పుణ్యమా అని ఏపీకి సంబంధించి అందరి కళ్లూ వైజాగ్ మీదనే. విజయవాడ.. గుంటూరులో మెట్రో కల్చర్ పెద్దగా లేకపోవటం.. వసతులు అంత స్థాయిలో ఉండకపోవటంతో.. అలాంటి హంగులు ఎంతోకొంత ఉన్న విశాఖపట్నం వైపు అందరి దృష్టి పడుతోంది.
వివిధ కార్యక్రమాల నిర్వహణతో పాటు.. పారిశ్రామికంగా ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖ మీదనే అందరి దృష్టి పుడుతోంది. దీంతో.. ఇక్కడి హోటల్ రంగానికి కొత్త కళ వచ్చింది. సభలు.. సమావేశాలు.. వర్క్ షాపులతో పాటు.. కొత్త వ్యాపార అవకాశాల కోసం ఏపీ వరకూ అందరి దృష్టి వైజాగ్ మీద పడటంతో ఇక్కడి హోటల్ రూమ్ లు ఫుల్ గా బుక్ అయిపోతున్న పరిస్థితి.
విభజనకు ముందు ఇక్కడ హోటల్ అక్యూపెన్సీ 60 శాతం ఉంటే.. ఇప్పుడు వంద శాతంగా మారింది. అంతేకాదు.. పెద్ద హోటళ్ల మొదలు ఒక మోస్తరు హోటళ్లలో రూమ్ కోసం కనిష్టంగా వారం ముందు బుక్ చేసుకోవాల్సి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో నెల రోజులు ముందు కూడా రూమ్ లు దొరకని పరిస్థితి. పెరిగిన డిమాండ్ తో హోటల్ ఛార్జీలు కూడా భారీగా పెరిగిపోయాయి. విభజన సమయంలో స్టార్ హోటల్ లో సింగిల్ రూమ్ అద్దె రోజుకు రూ.4వేలు ఉంటే.. ఇప్పుడదే రూ.6వేలకు పైనే పలుకుతోంది.
ప్రస్తుతం విశాఖలో 15 స్టార్ హోటళ్లు.. 200 సాధారణ హోటళ్లతో పాటు.. మరో 200 లాడ్జిలు ఉన్నాయి. మొత్తంగా 6వేల గదుల వరకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న డిమాండ్ తో చూస్తే.. దాదాపు 10వేల గదుల అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విశాఖలో హోటల్ బిజినెస్ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా ఉందని చెబుతున్నారు. అవకాశాల కోసం వెతికే వారు.. విశాఖ వైపు కాస్త దృష్టి సారిస్తే మంచిదేమో.