పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలను చైతన్యం చేసి పోలింగ్ శాతం పెంచేందుకు ఆ దేశంలోని 20 ప్రముఖ రెస్టారెంట్లు - హోటళ్లు సామాజిక మాధ్యమాలు - ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ వినూత్న ప్రచారానికి దిగాయి. ఎన్నికల్లో ఓటువేసినట్లు గుర్తుగా సిరా చుక్కరాసిన వేలిని చూపిస్తే చాలు.. ఈ ఆఫర్లను మీ సొంతం చేసుకోవచ్చు. అంటూ ప్రచారం మొదలుపెట్టింది. రండి బాబు రండి.. మీరు ఓటేశారా? అయితే.. ఉచితంగా భోజనం చేయండి.. ఈ హల్వా పూరి మీదే.. భయ్యా కూల్ డ్రింక్ తాగి వెళ్లండి.. ఇదిగో ఈ పిజ్జా మీకే.. బాబూ ఈ బర్గర్ తిని వెళ్లు.. బ్రదర్ మా దగ్గర దుస్తులు కొనుగోలు చేస్తే ఈ రోజు 50 శాతం డిస్కౌంట్.. ఏంటీ ఆఫర్లతో ఊదరగొట్టేసింది.
పాకిస్థాన్ లో బుధవారం 272 జాతీయ అసెంబ్లీ స్థానాలకు - నాలుగు రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఓటింగ్ శాతం పెంచేందుకు ఆఫర్లు ప్రవేశపెట్టింది. `ఓటు వేయడం మన హక్కు. దేశ ముఖచిత్రాన్ని మార్చే శక్తి ఓటుకే ఉంది. ఓటు వేద్దాం.. దేశాన్ని మారుద్దాం. ఓటు వేసి రండి.. హల్వా పూరిని తినండి`` అని కరాచీలోని ప్రముఖ రెస్టారెంట్ చుపారుస్తుం ప్రకటించింది. ``మీరు ఎవరికైనా ఓటువేయండి. కానీ తప్పకుండా ఓటు వేయండి. నేరుగా ఇక్కడకు రండి.. చల్లటి శీతలపానీయం తాగి వెళ్లండి`` అంటూ కరాచీలోని మరో ప్రముఖ హోటల్ అంబ్రోసియా ఫేస్ బుక్ లో పిలుపునిచ్చింది. దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీ ఈ రోజున కొనుగోలు చేసే వస్ర్తాలపై ఏకంగా 50 శాతం భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది.
ఇదిలాఉండంగా..తాలిబన్లకు గట్టి పట్టున్న గిరిజన ప్రాంతమైన ఎగువ దిర్ జిల్లాలో మహిళలు తొలిసారిగా ఓటుహక్కును వినియోగించుకున్నారు. అఫ్ఘానిస్థాన్ సరిహద్దులో ఉన్న దిర్ జిల్లాలో ఉగ్రతండాల ప్రాబల్యం ఎక్కువ. దేశంలో 1970లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటివరకూ వారు ఓటు వేయలేదు. బుధవారం రికార్డు స్థాయిలో మహిళలు క్యూలలో నిలబడి ఓటుహక్కును వినియోగించుకున్నారు.