రాక్షసులు సైతం మరీ ఇంత దుర్మార్గంగా.. కర్కసంగా ఉండరేమోనన్న భావన కలిగించే వారు ఎవరైనా ఉన్నారంటే వారు ఐసిస్ ఉగ్రవాదులే. దారుణ మారణకాండకు పాల్పడటమే కాదు.. ప్రపంచాన్ని వణికించేలా చేయటం వారికి అలవాటే. అయితే.. ఈ రాక్షసుల్ని సింఫుల్ గా తీసుకుంటే ఎంత నష్టమన్న సంగతి ఇప్పటికే పలు దేశాలకు అర్థమైనా.. తాజాగా వీరికి సంబంధించిన బయటకు వచ్చిన ఒక నివేదిక సారాంశాన్ని చూస్తే షాక్ తినాల్సిందే.
దూరదృష్టితో పాటు.. ప్రపంచాన్ని తమ అధీనంలోకి తీసుకురావాలన్న కసితో వారు చేస్తున్న ప్రయత్నాలు వింటే ముక్కున వేలేసుకునే పరిస్థితి. ఉగ్రవాద కార్యకలాపాల్ని నిర్వహించటం ఎంత కష్టమో.. ఉగ్రవాదుల్ని తయారు చేసుకోవటం.. తాము చేసే మారణకాండకు తగినట్లుగా మైండ్ సెట్ ను ట్యూన్ చేసి.. తమకోసం ఎంతకైనా తెగించటం.. ప్రాణాలు తీసుకోవటం.. ప్రాణాలు తీయటం లాంటి ప్రమాదకర ధోరణులు నరనరాన నింపటం అంత సులువైన పని కాదు. తాము మొదలు పెట్టిన రాక్షసకాండను నిరంతరం కొనసాగేలా చూడటం.. భవిష్యత్తు ఉగ్రవాదుల్ని తయారు చేసేందుకు ఐసిస్ దారుణమైన ప్లాన్ ఒకటి అమలు చేస్తున్న విషయం తాజాగా బయటకు వచ్చింది.
లండన్ కు చెందిన ఖిల్లియమ్ అనే సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఐసిస్ భావజాలాన్ని విశ్వవ్యాప్తి చేయటంతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా ఐసిస్ తీవ్రవాదులతో అతలాకుతలం చేసేందుకు వీలుగా.. ఇప్పుడు వారు 31 వేల మంది మహిళల కడుపుల్లో భవిష్యత్తు ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్న సంచలన విషయం బయటకు వచ్చింది. ఇంత పెద్ద సంఖ్యలో మహిళల్ని గర్భిణులు చేసి.. వారికి సకల సౌకర్యాలు అందించి..వారికి ఉగ్రసాహిత్యాన్ని అందుబాటులో ఉంచటం.. గర్భిణులు.. ప్రత్యేకంగా రూపొందించిన ఐసిస్ అనుకూల గీతాల్ని వారికి పదే పదే వినిపించటం లాంటివి చేస్తున్నారట.
పిల్లలు పుట్టి.. పెరిగే సమయంలో ఇతర మతాల్ని ఎలా ద్వేషించాలన్న విషయంపై సదరు మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారట. ఇప్పుడు తాము చేస్తున్న ఉగ్రవాదాన్ని పుల్ స్టాప్ పెట్టేలా ప్రపంచ దేశాలు ఏదైనా చర్య తీసుకున్నా.. ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేలా చేయటం.. ఉగ్రవారసుల్ని తయారు చేసే విషయంపై భారీ ప్లానింగ్ ఉన్న రాక్షసుల తీరు ఇప్పడు హాట్ టాపిక్ గా మారటమేకాదు.. ఈ నివేదిక చదివిన వారంతా షాక్ కు గురయ్యే పరిస్థితి.