భారత్ లో పెట్రోల్.. డీజీల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా నిత్యావసర ధరలు సైతం హద్దు అదుపు లేకుండా పోతున్నాయి. కరోనా కాలంలో చమురుకు డిమాండ్ పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్.. డీజిల్ ధరలు నేలచూపులు చూశాయి. అయితే ఆ సమయంలో భారత్ లో చమురు ధరలు ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం.
ఇక కరోనా పరిస్థితి నుంచి ప్రపంచం కోలుకున్నాక చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఈ సమయంలో మాత్రం భారత్ తో మునుపటి కంటే రెండింతలు పెట్రోల్.. డీజిల్.. గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు.. సామాన్యులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో కేంద్రం ఎన్నికలు జరిగే సమయంలో పెట్రోల్.. గ్యాస్.. డీజిల్ ధరలను ఒకింత తగ్గిస్తూ ఎన్నికలు పూర్తవ్వగానే అమాంతం మళ్లీ పెంచేస్తుండటం ఇటీవలి కాలంలో తరుచూ జరుగుతోంది. అయితే చమురు ధరల విషయంలో రష్యాకు భారత్ అండగా నిలుస్తుండటంతో ఆ దేశం తక్కువ ధరకే మనకు చమురు లభ్యమవుతోంది.
ఈ నేపథ్యంలో భారత్ పెరుగుతున్న పెట్రోల్.. డీజిల్ ధరలకు కళ్లెం పడే అవకాశం కన్పిస్తోంది. ఉక్రెయిన్-రష్యా వార్ నేపథ్యంలో రష్యా చమురు ఎగుమతులపై జీ7 దేశాలు పలు ఆంక్షలు విధించాయి. అయితే ఈ ఆంక్షలను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. భారత్ చర్యలపై మాస్కో సంతోషం వ్యక్తంగా భారత్ కు భారీ డిస్కౌంట్ తో క్రూడ్ ఆయిల్ ను సరఫరా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అంతేకాకుండా భవిష్యత్ లోనూ తక్కువ ధరలో చమురు కొనుగోళ్లను కొనసాగించేలా భారీ సామర్థ్యం ఉన్న ఓడల నిర్మాణం.. లీజు వ్యవహారంపై భారత్ కు సహకరించనున్నట్లు రష్యా తాజాగా ప్రకటించింది. ఆ మేరకు మాస్కోలోని భారత రాయబారి పవన్ కపూర్ తో రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ సమావేశమై ఈ విషయాన్ని ప్రకటించినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈనెల 5న జీ7 దేశాలు సమావేశమై రష్యా చమురుకు గరిష్టంగా 60 డాలర్లు చెల్లించాలని నిర్ణయించాయి. పరిమితికి మించి ఎక్కువ ధరకు కొనుగోలు చేసిన రష్యా చమురుపై బీమా సేవలు.. షిప్పింగ్ ను నిషేధిస్తున్నట్లు ప్రకటించాయి. అయితే ఈ నిర్ణయాన్ని భారత్ పూర్తిగా వ్యతిరేకించింది. ఇంధన సంక్షోభం ఉన్నప్పటికీ చమురు ఎగుమతులు.. ఇంధన వనరుల సరఫరాలో రష్యా తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తుందని పేర్కొంది.
కాగా మరోవైపు ఉక్రెయిన్-రష్యా వార్ నేపథ్యంలో చమురు ధరలు కొండెక్కుతున్నాయి. మరోవైపు ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని పెంచేందుకు సానుకూలంగా లేకపోవడంతో ఆ ప్రభావం చమురు ధరలపై పడే అవకాశం కన్పిస్తోంది. అయితే భారత్ కు మాత్రం రష్యా భారీ డిస్కౌంట్ ఇస్తుండటంతో పెద్దమొత్తంలో క్రూడ్ ఆయిల్ ను భారత్ దిగుమతి చేసుకుంటోంది.
వరుసగా రెండో నెలలోనూ భారత్ కు అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా రష్యా నిలిచింది. నవంబర్లో రోజుకు 9లక్షల 9వేల 403 పీపాల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంటుండడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.