175 నియోజకవర్గాల్లో 90మంది షాడో ఎమ్మెల్యేలు ఉన్నారా?

Update: 2020-08-07 05:15 GMT
ఎమ్మెల్యే అనేది ఒక రాజకీయ నాయకుడి చిరకాల వాంఛ. ఆ పదవికి చేరుకోవడానికి చాలా మంది నానా కష్టాలు పడుతుంటారు. అయితే అధికారం దక్కగానే ప్రజలను విస్మరిస్తున్నారు. మరోసారి గెలవకుండా అంతర్థానమైపోతుంటారు. ప్రజల్లో ఉండే నాయకులే ఆ తర్వాత కాలంలో మంత్రులుగా... ముఖ్యమంత్రులుగా ఏలుతుంటారు.

ఇప్పుడు కొత్తగా వైసీపీలో ఎమ్మెల్యేలుగా చాలా మంది గెలిచారు. కొందరు సీనియర్లు ఉన్నారు. కానీ ఎవరూ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండడం లేదనే ఫిర్యాదులున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు తక్కువేం కాదని.. వారు కూడా ప్రజలకు దూరంగానే పాలిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాల్లో 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, 20మంది టీడీపీ ఎమ్మెల్యేలు.. ముగ్గురు అటూ ఇటూ కాకుండా వైసీపీలోకి జంప్ చేసిన టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలున్నారు. అయితే ఎమ్మెల్యేలు అమావాస్యకు, పౌర్ణమికి మాత్రమే కనిపిస్తున్నారని ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండడం లేదు అని.. వాళ్ల తరుఫున తండ్రులు, కొడుకులు.. తమ్ముళ్లు, బామ్మర్ధులు దాదాపు 90మంది వరకు షాడో ఎమ్మెల్యేలుగా నియోజకవర్గాల్లో అధికారం చెలాయిస్తున్నారని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాకు వీళ్లంతా పనిచేయడం లేదని.. ఎవరైతే డబ్బు ఇస్తే వాళ్లకే చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.

ఇలాంటి వారి విషయంలో వైసీపీ, టీడీపీ అధిష్టానాలు నజర్ పెట్టకపోతే ఆ పార్టీల పుట్టి మునగడం ఖాయమంటున్నారు. ప్రజల్లోనే నేతలు ఉండేలా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ ఉండదని ఆ దిశగా ఎమ్మెల్యేలను వారి సొంత నియోజకవర్గాలకు నడిపించాలని కోరుతున్నారు.
Tags:    

Similar News