కాంగ్రెస్‌ దగ్గర అప్పుడే డబ్బులు అయిపోయాయా?

Update: 2015-07-06 10:07 GMT
పదేళ్ల పాటు నాన్‌స్టాప్‌గా అధికారాన్ని అనుభవించి.. లెక్కకుమిక్కిలి కుంభకోణాలతో విపరీతమైన పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించిన కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం తీవ్రమైన నిధుల కొరత ఎదుర్కొంటుందా? అంటే.. అవునని చెబుతున్నారు ఆ పార్టీ సీనియర్‌ నేత మోతీలాల్‌ ఓరా.

పదేళ్ల పాటు దేశాన్ని ఏలిన పార్టీకి నిధుల కొరతతో అల్లాడుతున్నట్లుగా కాంగ్రెస్‌ కోశాధికారి ఓరా చెబుతున్నారు. అందుకే.. తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ సభ్యత్వ రుసుమును పెంచుతున్నట్లు వెల్లడించారు. పార్టీ సభ్యత్వం కోసం వసూలు చేసే మొత్తాల్ని తాజాగా ప్రకటించిన ఆయన.. నిధుల కొరతతోనే ఈ నిర్ణయాన్ని తీసుక్నుట్లు చెప్పుకొచ్చారు.

అధికారం పోయిన ఏడాదికే డబ్బులు అయిపోవటం ఏమిటని పలువురు ఆశ్చర్యపోతున్నారు. అప్పుడే పార్టీ బక్కసం ఖాళీ అయిపోతే.. ఎన్నికలకు ఇంకో నాలుగేళ్లుఉన్న నేపథ్యంలో సభ్యత్వ రుసుముల పెంపుతోనే నిదులతో కళకళలాడుతుందా? అని ప్రశ్నిస్తున్నారు. అయినా.. విపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా సభ్యత్వ రుసుములు పెంచుతారా? అని మండిపడుతున్నారు.

ఓపక్క అధికార బీజేపీ.. ఆకర్షణీయ విధానాల్లో పార్టీ సభ్యత్వాన్ని ఇస్తుంటే.. కాంగ్రెస్‌ పార్టీ అందుకు భిన్నంగా వ్యవహరించటంపై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. రానున్న రోజుల్లో పార్టీ సభ్యత్వ రుసుమును రూ.250కి పెంచుతున్నట్లు చెప్పారు. ఇందులో వందరూపాయిల్ని రాష్ట్ర పార్టీకి.. రూ.150 జాతీయ పార్టీకి బట్వాడా చేస్తారని చెబుతున్నారు.

Tags:    

Similar News