తెలంగాణ తెలుగుదేశం బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి గళం విప్పారు. గడిచిన కొంతకాలంగా బాబు మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న ఆయన.. తాజాగా మరోసారి నిప్పులు చెరిగారు. గడిచిన మూడు నెలలుగా తాను రాజకీయాల గురించి మాట్లాడలేదన్న ఆయన.. తన లక్ష్యం గురించి మాత్రమే చెబుతున్నట్లుగా చెప్పారు. దళితుడైన తనను అమర్యాదకరంగా పార్టీ నుంచి గెంటివేశారంటూ తప్పు పడ్డారు.
15 ఏళ్లు చంద్రబాబు దగ్గర కుక్కలా ఉన్నానని.. కానీ తనను మాత్రం ఆయన వాడుకొని చివరకు గొంతు పిసికి రోడ్డు మీదకు విసిరేశారన్నారు. తనకు చేసిన అన్యాయానికి చంద్రబాబు మూల్యం చెల్లించకతప్పలేదన్నారు. తనకు మంత్రి పదవిని ఇస్తానని చెప్పారని.. తర్వాత కాలంలో గవర్నర్ ను చేస్తామని కూడా చెప్పారని..కానీ.. ఎలాంటి పదవీ ఇవ్వకుండా రోడ్డున పడేశారన్నారు.
చంద్రబాబును రోడ్డు మీద పడేసేందుకు అంతా ఏకమవ్వాలన్నారు. బాబు ఒక చీడపురుగుగా అభివర్ణించిన మోత్కుపల్లి.. బాబును ఓడించేందుకు జగన్.. పవన్.. కిరణ్ కుమార్ రెడ్డిలు కలవాలన్నారు. ఏ తప్పు చేయని తన గొంతు కోసి చంద్రబాబు అందుకు తగిన మూల్యం చెల్లించాలన్నారు. తాను ఏ పార్టీలో చేరాలనే విషయం మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ఆయన.. తనను బాబు బాగా వాడుకున్నారన్నారు.
తాను ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయించుకోలేదని.. తన గౌరవాన్ని కాపాడే పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. తనను ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఆదరించిన ఆలేరు ప్రజల నుంచి ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మాల.. మాదిగలంటే చిన్నచూపు చూసే చంద్రబాబుకు చుక్కలు చూపించాలన్న తన అభిమతంగా చెప్పారు. పవన్ కు ఒక మిత్రుడిలా సాయం చేయాలనుకున్నట్లు చెప్పిన మోత్కుపల్లి.. జగన్ కు కూడా మిత్రుడిగా తనకు తోచిన సాయం చేస్తానని చెప్పారు. తాను తిరుపతికి వెళ్లినప్పుడు జగన్.. పవన్ మనుషులు తన కోసం వచ్చినట్లుగా చెప్పారు.