అసద్ సీన్లోకి రావటంతో 32 మంది ఆ దానానికి రెఢీ

Update: 2020-04-28 07:30 GMT
కరోనా ఎపిసోడ్ లో చాలామంది మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీని తీవ్రస్థాయిలో తప్పు పట్టారు. కరోనా అనుమానితులు తమకు తాముగా బయటకు రావాలని.. వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలన్న మాటను కనీసం ఆయన నోటి నుంచి రాలేదని ఫైర్ అయినోళ్లు చాలామందే. అన్నింటికి మించి మర్కజ్ ఎపిసోడ్ లో.. ఢిల్లీ ప్రయాణానికి వెళ్లి వచ్చిన వారు తమకు తాము అధికారులకు సమాచారం అందించే విషయంలో భయాందోళనలకు గురైనట్లు చెబుతారు. ఈ విసయంలో కలుగజేసుకొని.. అసద్ మరింత యాక్టివ్ గా వ్యవహరించి ఉంటే.. తెలంగాణలో ఇప్పుడున్నన్ని కేసులు నమోదయ్యేవి కావన్న విమర్శ ఉంది.

తన మీద వెల్లువెత్తుతున్న విమర్శలకు రియాక్ట్ కావటం మజ్లిస్ అధినేతకు అలవాటు ఉండదు. తనను తప్పు పట్టే వారిని లైట్ తీసుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోవటం ఆయనకు అలవాటు. ఇదిలా ఉంటే.. తాజాగా ఊహించిన రీతిలో వ్యవహరించిన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు అసద్. కరోనాకు వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చేట్లుగా కనిపించక పోవటం.. సామాజిక దూరాన్ని పాటిస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవటం మినహా కరోనాను కట్టడి చేసే అవకాశం లేదు.

ఇలాంటివేళ.. కరోనాను జయించిన వారి వారు తమ ప్లాస్మాను ఇచ్చిన పక్షంలో పరిస్థితి మరింత బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. కరోనాను జయించిన వారు తమ ఫ్లాస్మాను ఇచ్చేందుకు ఆసక్తిని ప్రదర్శించటం లేదు. ఇలాంటివేళ.. హైదరాబాద్ ఎంపీ అసద్ 32 మందితో పర్సనల్ గా మాట్లాడి వారిని ఒప్పించినట్లుగా చెబుతున్నారు. కరోనాతో కోలుకున్న వారితో మాట్లాడి.. ప్లాస్మా దానానికి ఒప్పించటంతో వారంతా అసద్ బాస్ చెప్పినట్లుగా చేయటానికి సిద్దమయ్యారట. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్.. మంత్రి కేటీఆర్ లకు లేఖ రాశారు అసద్. మొత్తానికి ప్లాస్మా దానాన్ని ఇచ్చేందుకు ఒప్పించిన అసద్ తీరుపై ఎలాంటి స్పందన వ్యక్తమవుతుందో చూడాలి.
Tags:    

Similar News