వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక దశకు చేరుకుంది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో ప్రధాన నిందితులను ఇటీవల గుర్తించింది. ఈ నేపథ్యంలో వారిని అరెస్టు చేసే పనిలో ఉంది. ముందుగా వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని విచారించిన సీబీఐ అతని ద్వారా అసలు నిందితులెవరో రాబట్టింది. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ముందుగా ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు శివశంకర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
అయితే ఆయనకు ఇదివరకు నోటీసులు పంపినా కోర్టుకు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించగా అనారోగ్య కారణాలని చెప్పారు. దీంతో అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు హైదరాబాద్లోని అసుపత్రికి తీసుకెళ్లి ఆ తరువాత కోర్టు అనుమతితో పులివెందుల జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఎంపీ అవినాశ్ రెడ్డి కడజ జైలు వద్ద శివశంకర్ రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ అధికారులపై ఫైర్ అయ్యారు. శంకర్ రెడ్డి ఆరోగ్యం బాగా లేదని, అయినా ఆయనను అరెస్టు చేస్తారా..? అని ప్రశ్నించారు. దీంతో పోలీసులు ప్రతిగా ‘అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు..?’ అని ఎంపీని ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది.
శంకర్ రెడ్డిని పులివెందలు కోర్టుకు తీసుకొచ్చి జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. దీంతో ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ సమయంలోనే ఎంపీ అవినాశ్ రెడ్డి అక్కడకు వచ్చారు.
అయితే ఎంపీ అవినాశ్ రెడ్డి, కోర్టు ఆవరణలో శంకర్ రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడారు. అలాగే సీబీఐ అధికారులతోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. దీంతో కొన్ని మీడియా సంస్థలు వారిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాయి.
ఇక శంకర్ రెడ్డిని కడప రిమ్స్ కు తీసుకొచ్చినప్పుడు కడప మేయర్ సురేశ్ బాబు, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, మరికొందరు నాయకులు కలిసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా శంకర్ రెడ్డిని పులివెందుల కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. శంకర్ రెడ్డి ఉన్న వాహనం రాగానే అరుపులు, కేకలతో వైసీపీ కార్యర్తలు గోలగోల చేశారు.
వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారు. శంకర్ రెడ్డి ఐదో వ్యక్తిగా ఉన్నారు. వైఎస్ వివేకా మాజీ డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలంతో దర్యాప్తును వేగం చేసింది. ఇప్పటి వరకు ఎర్ర గంగిరెడ్డి, షేక్ దస్తగిరిలను అరెస్టు చేయగా వారు బెయిల్ పై బయటికొచ్చారు. అలాగే సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డిలను అరెస్టు చేయగా వారు జైలులో ఉన్నారు. తాజాగా శంకర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు.