వాట్సాప్ లో అశ్లీల వీడియో..ఎంపీపై కేసు!

Update: 2017-09-16 18:01 GMT
ఈ మ‌ధ్య ప్ర‌జాప్ర‌తినిధులు బాధ్య‌తా ర‌హితంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఘ‌ట‌న‌ల గురించి మ‌నం వింటూనే ఉన్నాం. ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఎన్నికైన వారు విజ్ఞ‌త‌ను మ‌ర‌చి పార్ల‌మెంటు, అసెంబ్లీల‌లో కూడా అశ్లీల చిత్రాలు చూసిన ఘ‌ట‌నలున్నాయి. కొంతమంది ప్ర‌జాప్ర‌తినిధులు ఆ త‌ర‌హా చేష్ట‌ల‌కు సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకున్న దాఖ‌లాలు కూడా ఉన్నాయి. తాజాగా అదే త‌ర‌హాలో ఆప్ కు చెందిన ఓ ఎంపీ ఓ వాట్సాప్‌ గ్రూప్‌ లో అసభ్య వీడియోను పోస్ట్ చేశారు. ఫతేగఢ్‌ సాహిబ్  ఎంపీ హరిందర్‌ సింగ్‌ ఖల్సా ఈ చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. క్ర‌మ శిక్ష‌ణ‌ను ఉల్లంఘించడంతో అత‌డిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు.

కొద్ది రోజుల క్రితం హరిందర్‌ సింగ్‌ ఓ వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియోను పోస్ట్ చేశారు. పైగా ఆ వీడియోకు 'బేబ్ ది బేటీ హ‌నీప్రీత్ ' అంటూ  కాప్షన్‌ కూడా పెట్టారు. అదే గ్రూపులో సభ్యురాలైన రేణు సోనియా అనే మహిళ హరిందర్‌ సింగ్ ను ఈ వీడియో గురించి ప్ర‌శ్నించారు. ఆమె ప్ర‌శ్న‌కు హరిందర్‌ సింగ్ జ‌వాబు చెప్ప‌క‌పోవ‌డ‌మే కాకుండా వెంటనే గ్రూప్‌ నుంచి ఎగ్జిట్ అయ్యారు. దీంతో - రేణు సోనియా ఈ ఘ‌ట‌న‌పై లూథియానా డీఐజీకి ఫిర్యాదు చేశారు. బాధ్య‌త గ‌ల ఓ ప్రజా ప్రతినిధి అయిన హరిందర్‌ సింగ్ ఇటువంటి చెత్త పనులు చేయటం సరికాదని ఆమె అన్నారు. పైగా ఆ ఘ‌ట‌న గురించి ప్రశ్నిస్తే క‌నీసం సమాధానం ఇవ్వకపోవటం స‌రికాద‌ని రేణు మండిపడుతున్నారు. ఈ వీడియో వ్య‌వ‌హారం ఆప్ అధ్య‌క్షుడు కేజ్రీవాల్ కు తెల‌య‌డంతో హరిందర్‌ సింగ్ ను వెంట‌నే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
 
అయితే, ఈ ఘ‌ట‌న పై హరిందర్‌ సింగ్ వివ‌ర‌ణ వేరేలా ఉంది. తాను అమాయ‌కుడిన‌ని, రేణు ఆరోపిస్తున్నట్లుగా ఆ వీడియోను వాట్సాప్‌ గ్రూప్‌ లో తాను పోస్ట్ చేయలేదని హరిందర్‌ సింగ్ అన్నారు. కొద్ది వారాల నుంచి తాను ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నాన‌ని,  ఆ సమయంలో త‌న ఫోన్ ను ఇండియాలో వ‌దిలి వెళ్లాన‌ని చెప్పారు.  కొందరు ఆక‌తాయి యువకులు తన ఫోన్ లో అసభ్య వీడియో డౌన్‌ లోడ్‌ చేసి, వాట్సాప్‌ గ్రూప్ ల‌లో స‌ర్క్యులేట్ చేసి త‌న‌ను అప్ర‌తిష్ట పాలు చేశార‌ని వివరణ ఇచ్చుకున్నారు. కొందరు ఆప్‌ మహిళా కార్యకర్తలు కావాలనే తనపై క‌క్షగ‌ట్టి ఆరోపణలు చేస్తున్నార‌ని  హరిందర్ ఆరోపించారు.

Full View
Tags:    

Similar News