నాని మాటే శాసనం: విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి వీరే..

Update: 2021-03-04 13:30 GMT
కొద్దిరోజులుగా బెజవాడ టీడీపీలో మూడు వర్గాల మధ్య మున్సి'పోరు' రసవత్తరంగా సాగుతోంది. టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని ఓవైపు.. అసమ్మతి టీడీపీ నేతలంతా మరోవైపు చేరి సీట్ల కోసం చేసుకుంటున్న 'పంచాయితీ' హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. నాని బెజవాడ కార్పొరేషన్ సీట్ల పంపిణీని ఆయన ప్రత్యర్థి రెండు వర్గాలు వ్యతిరేకిస్తూ రెబల్స్ గా బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలోనే మేయర్ సీటుపై కూడా పీటముడి నెలకొంది.విజయవాడ మేయర్ పీఠం కోసం టీడీపీ అభ్యర్థి పేరును తాజాగా అధిష్టానం ఖరారు చేసింది. ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేతను మేయర్ అభ్యర్థిగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖరారు చేశారు.

కొద్దిరోజులుగా టీడీపీ మేయర్ అభ్యర్థిగా   ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తిరేపింది. ఇక్కడి నేతలు మూడు వర్గాలుగా విడిపోయి అసమ్మతి రాజేశారు. శ్వేతను మేయర్ గా ప్రకటించడాన్ని రెండు వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. విజయవాడ సెంట్రల్ ప్రాంతానికి చెందిన వారినే మేయర్ చేయాలని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికే కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ కేశినేని నాని, బుద్దా వెంకన్న వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి.కానీ చివరకు కేశినేని నాని పట్టుదలతో ఆయన కుమార్తెకే విజయవాడ మేయర్ అభ్యర్థిత్వం దక్కింది.
Tags:    

Similar News