విజయవాడ ఎంపీ కేశినేని నానికి అరుదైన గౌరవం లభించింది. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ఆయన చేసిన ప్రజా సేవకు గుర్తింపుగా పొలిటికల్ ఎక్సలెన్సీ అవార్డు దక్కింది. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా నాని ఈ అవార్డును అందుకున్నారు. సృజనా కల్చరల్ అండ్ లిటరసీ ఆర్గనైజేషన్ వారు ఈ అవార్డును అందించారు.
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు టాటా ట్రస్టు అంగీకరించింది. 2015 లో మొత్తం 264 గ్రామాలను టాటా ట్రస్టు దత్తత తీసుకుంటున్నట్లు ఎంవోయూ చేసుకుంది. కేవలం నాని అంకిత భావం - నిబద్ధత - కృషి వల్లే టాటా ట్రస్టు ఈ ఒప్పందానికి అంగీకరించింది. దేశం మొత్తంలో తమ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి టాటా ట్రస్టు ఒప్పుకునేలా చేసిన ఏకైక ఎంపీ కేశినేని నాని కావడం గమనార్హం.
ఈ ఒప్పందంలో నాని కీలకమైన పాత్ర పోషించారు. నాని కృషి వల్లే దేశంలోని మిగతా నియోజకవర్గాలు విజయవాడను అభివృద్ధిలో ఆదర్శంగా తీసుకుంటున్నాయి. దేశంలో విజయవాడ మోడల్ నియోజకవర్గంగా మారింది. అనవసర వివాదాలకు దూరంగా ఉండేందుకు, పూర్తి సమయం ప్రజాసేవకు కేటాయించడానికి వీలుగా నాని తన ట్రావెల్స్ వ్యాపారాన్ని నిలిపివేశారు. 1928 నుంచి నాని తాతగారు కేశినేని వెంకయ్య ఈ ట్రావెల్స్‌ను నడుపుతున్నారు.
నాని సేవలను గుర్తించిన సృజనా కల్చరల్ అండ్ లిటరసీ ఆర్గనైజేషన్ వారు ఆయనను పొలిటికల్ ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ కే.కేశవరావు, మాజీ మంత్రి గీతా రెడ్డి, సినీ నటుడు సుమన్ తదితరులు పాల్గొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/