అతడు బండి కొనటం ఇప్పుడు వైరల్ వార్తగా మారింది

Update: 2019-10-27 04:46 GMT
దసరా.. దీపావళి వచ్చిందంటే చాలు.. ఈ పండుగ వేళ ఏదైనా పెద్ద వస్తువులు కొనాలని ప్లాన్ చేస్తుంటారు చాలామంది. ఈ కారణంగానే వాహన రంగానికి సంబంధించి కానీ.. ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలకు ఈ రెండు పండుగలకు మించిన సీజన్ మరొకటి లేదని చెబుతారు. ఇప్పుడు ఇదే అంశం ఇప్పటివరకూ ఎవరికి తెలీని ఒక సామాన్యుడ్ని వార్తల్లో వ్యక్తిగా మార్చేసింది.

మధ్యాప్రదేశ్ లోని సత్నా జిల్లాకు చెందిన రాకేశ్ కుమార్ గుప్తా అనే వ్యక్తి తాజాగా హోండా యాక్టివా 125ను ముచ్చటపడి కొనుక్కున్నాడు. దాని ధర రూ.83వేలు. ఇక్కడి వరకూ అంతా రోటీన్ గా ఉన్నప్పటికీ.. ఇక్కడే ఎవరూ ఊహించని రీతిలో ట్విస్ట్ ఇచ్చాడు గుప్తా. తాను కొన్న వాహనానికి సంబంధించిన పేమెంట్ కోసం రూ.పది.. రూ.5 నాణెల మూటను తీసుకొచ్చి షోరూంలో పెట్టాడు.

నోట్లు ఇచ్చేందుకు.. క్రెడిట్ కార్డుతో చెల్లించేందుకు ససేమిరా అన్న అతగాడి దెబ్బకు.. చేసేదేమీ లేక భారీ చిల్లర నాణెల మూటను విప్పి.. వాటిని లెక్కేసే పనిలో పడ్డారు షోరూం సిబ్బంది. దాదాపుగా ఐదారుగురు ఉద్యోగులు ఏకంగా మూడు గంటల పాటు లెక్కిస్తే కానీ రూ.83వేల లెక్క తేలలేదట.

ఎందుకిలాంటి పని చేశాడన్న విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు కానీ.. ఇప్పుడాయన ఫోటోలు.. ఆయన చిల్లల నాణెలు.. వాటిని లెక్కించేందుకు షోరూం సిబ్బంది పడిన శ్రమ ఇప్పుడు వైరల్ గా మారాయి. టూవీలర్లు అందరూ కొంటారు కానీ.. రాకేశ్ కొనుగోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News