రాజకీయ నేతలు ఒకప్పటిలా మడికట్టుకుని కూచోవడం అన్నది ఇటీవల లేదు. ముఖ్యంగా యువ కథానాయికలు ఎంపీలు అవ్వడం అన్నది చాలా కాలంగా చూస్తున్నదే. లోక్ సభలో అడుగు పెట్టాలంటే తెల్ల ఖద్దరు ధరించాలి! అన్న రూల్ ని బ్రేక్ చేస్తూ ఇటీవలి కాలంలో నవతరం నాయకులు సరికొత్త అవతారంతో కనిపిస్తున్నారు. డీసెన్సీని పాటిస్తూనే ట్రెండ్ ని క్రియేట్ చేస్తున్నారు.
అదే కోవలో పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపి.. హీరోయిన్ నుస్రత్ జహాన్ గ్లామరస్ యాంగిల్ యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా నుస్రత్ లోక్ సభ మొట్టమొదటి రుతుపవన సమావేశానికి హాజరయ్యారు. సింపుల్ డిజైనర్ చీరలో ఆమె కనిపించడం ఆసక్తిని కలిగించింది. ఓవైపు సోషల్ మీడియాలో వేడెక్కించే ఫోటోషూట్లు.. మరోవైపు లోక్ సభలో సాంప్రదాయ దుస్తులతో విలక్షణత అంటే ఏమిటో చూపించింది నుస్రత్.
నుస్రత్ తనపై వినిపించే కామెంట్ల గురించి ఏమన్నారు అంటే.. ``ఎవరో నన్ను ద్వేషిస్తారు.. నేను పట్టించుకోను. కనీసం నేను కాదు అని నటిస్తున్నాను`` అంటూ వ్యాఖ్యను సోషల్ మీడియాలో జోడించారు. ఇక లోక్ సభ లో సినీపరిశ్రమ తరపున తనదైన శైలిలో గళం విప్పిన నుస్రత్ పరిశ్రమ కోలుకోవాలంటే ఎంతో ఆదుకోవాల్సి ఉందని రిలీఫ్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేయడంపై చర్చ సాగింది. ఇక సినీకార్మికులు నిర్మాతలకు తక్షణ సాయం కావాలని కోరిన తొలి బెంగాళీ నటిగా అందరి మెప్పు పొందారు. వ్యక్తిగత మైలేజ్ కోసం టీఆర్పీల కోసం టీవీ చానెళ్ల ముందు గళం విప్పే చాలామంది కథానాయికలతో పోలిస్తే నుస్రత్ మంచి విషయాల్ని ప్రస్థావించారు అంటూ అంతా పొగిడేస్తున్నారు.