అనుకోని విధంగా కొన్ని సందర్భాల్లో వచ్చే ఇమేజ్ ను కాపాడుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఆ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే.. అంతగా పేరు ప్రఖ్యాతులు వస్తుంటాయి. అయితే.. ఈ సూక్ష్మాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మర్చిపోతున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీ అధికారపక్ష నేతలకు భిన్నంగా పార్టీ పైనా.. పార్టీ అధినేత మీద ఆయన చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
ప్రజాదరణ ఎక్కువగా ఉన్న అధినేతపై ఒంటికాలి మీద పోరాటం చేయటం అంత తేలికైన విషయం కాదు. ఎన్నో సైడ్ ఎఫెక్టులకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇలాంటి వాటికి తాను సిద్ధంగా ఉన్నట్లుగా రఘు రామ తన మాటల్లో స్పష్టం చేస్తున్నారు. మొదట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు.. విమర్శలు జగన్ ప్రభుత్వానికి కంట్లో నలకలా ఉండేవి. తాజాగా ఆయన తీరు మాత్రం అందుకు భిన్నంగా మారిందంటున్నారు.
ఇటీవల ఒక ప్రముఖ మీడియా సంస్థలో జగన్ సర్కారు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లుగా ఒక కథనం అచ్చేయటం సంచలనంగా మారింది. అందులోని అంశాల్ని కాస్త అటు ఇటూగా ప్రస్తావించిన రఘురామ.. తన ఫోన్ ను ట్యాప్ చేసినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక లేఖ ను కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లేఖ రాశారు. కొన్ని నెలలుగా తాను వినియోగిస్తున్న రెండు నెంబర్లు ట్యాప్ అవుతున్నట్లుగా పేర్కొన్నారు.
తన ఫోన్ లో సౌండ్స్ వస్తున్నాయని.. ఫోన్ మాట్లాడేటప్పడు డిస్టర్బెన్స్ వస్తుందన్నారు. తనకున్న సమాచారం ప్రకారం ఏపీ నిఘా వర్గాలు తన ఫోన్లను ట్యాప్ చేస్తున్నాయని.. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21 లను ఉల్లంఘించిటనమేనని పేర్కొన్నారు.
తనకు తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నట్లుగా రఘు రామ పేర్కొన్నారు. తాజాగా ఆయనచేసిన ఆరోపణల్నిచూస్తే.. పస కంటే నసే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. నిజంగానే తన ఫోన్ ట్యాప్ అవుతున్న సందేహం ఉంటే.. రఘురామకున్న నెట్ వర్క్ కు ఆ విషయాన్ని ఫ్రూవ్ చేసే ఆధారాల్ని సేకరించటం పెద్ద కష్టమైన పని కాదు. తాను సేకరించిన ఆధారాల్ని చూపిస్తే బాగుంటుంది కానీ.. మీడియాలోని ఒక కథనంలో పేర్కొన్న అంశాలన్ని తన ఫోన్ కు ఉందంటూ వినిపిస్తున్న వాదనలో విషయం లేదన్న మాట వినిపిస్తోంది.