జ‌గ‌న్ ఆస్తుల్లో ష‌ర్మిల‌కు వాటా.. ఎంపీ ర‌ఘురామ మ‌రో వివాదం

Update: 2021-08-13 03:11 GMT
వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. మ‌రో బాంబు పేల్చారు. ఇప్ప‌టికే వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు అనే క రూపాల్లో ఇబ్బందులు సృష్టిస్తున్నారనే ఆరోప‌ణ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కోరుతూ.. పిటిష‌న్ వేయ‌డం.. జ‌గ‌న్‌ ప్ర‌భుత్వంపై కేంద్రానికి ఫిర్యాదులు చేయ‌డం.. ఏపీ ప్ర‌భుత్వం ఆర్థిక అక్ర‌మాల‌కు పాల్ప‌డుతోంద‌ని చెప్ప‌డం.. వంటివి ఇప్ప‌టికే.. తీవ్ర వివాదంగా మారిన విష‌యం తెలిసిం దే. ఇప్పుడు తాజాగా మ‌రో వివాదాన్ని తెర‌మీదికి తెచ్చారు ర‌ఘురామ అంటున్నారు ప‌రిశీల‌కులు.

వైఎస్ కుటుంబానికి చెందిన విష‌యాన్ని ర‌ఘురామ తెర‌మీదికి తెచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ మాట్లాడ ని.. సాహ‌సించ‌ని ఆ కుటుంబం ఆస్తుల విష‌యాన్ని ర‌ఘురామ లేవ‌నెత్తారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబానికి త‌ర‌త‌రాలుగా ఆస్తులు ఉన్నాయి. ముఖ్యంగా రాజారెడ్డి హ‌యాంలో ఈ ఆస్తులు నాలుగు రెట్లు అయ్యాయ‌ని.. వైస్ విజ‌య‌మ్మ రాసుకున్న పుస్త‌కంలోనే చెప్పుకొచ్చారు. అయితే.. వైఎస్ సీఎం అయిన త‌ర్వాత‌.. ఈ ఆస్తులు మ‌రింత గా పెరిగాయ‌ని ప్ర‌తిప‌క్షాలు కూడా కొన్ని సంద‌ర్భాల్లో వ్యాఖ్యానించారు.

ఇక‌, జ‌గ‌న్ విష‌యాన్ని తీసుకుంటే.. వాస్త‌వానికి ఆయ‌న పెద్ద పారిశ్రామిక వేత్త‌. అనేక వ్యాపారాలు, ప‌రిశ్ర‌మ‌లు ఆయ‌న నిర్వ‌హించారు. నిర్వ‌హిస్తున్నారు కూడా. దీనిని బ‌ట్టి స‌హ‌జంగానేవైఎస్ కుటుంబ ఆస్తులు ల‌క్ష‌ల‌ కోట్ల రూపాయ‌ల్లోనే ఉంటాయ‌ని అంటారు ప‌రిశీల‌కులు. అయితే.. ఎప్పుడూ.. వీటి గురించిన చ‌ర్చ ఎవ‌రూ చేయ‌లేదు. ఎవ‌రి వాటా ఎంత‌? అనే విష‌యాన్ని కూడా ఎవ‌రూ తెర‌మీదికి తేలేదు. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ సోద‌రి.. తెలంగాణ‌లో పార్టీ పెట్టుకున్న ష‌ర్మిల కూడా ఎప్పుడూ.. ఆస్తుల గురించి ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు.

కానీ, ఇప్పుడు వైసీపీ ఎంపీ ర‌ఘురామ నోరు తెరిచారు. జ‌గ‌న్ ఆస్తిలో ష‌ర్మిల‌కు వాటా ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ అధికారంలోకి రావ‌డానికి జ‌గ‌న్ చెల్లి ష‌ర్మిల పాత్ర కూడా క్రియాశీల‌కమేన‌న్న ఆయ‌న ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ష‌ర్మిల సొంత పార్టీ పెట్టుకున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ ఆస్తుల్లో స‌గభాగం ష‌ర్మిల‌కు ఇవ్వాల‌ని ర‌ఘురామ స‌రికొత్త వాద‌న‌ను తెర‌మీదికి తెచ్చారు. త‌మ పార్టీ వైసీపీ విజయంలో సగ భాగం పాత్ర వహించిన షర్మిలకు ఆస్తిలో కూడా సగ భాగం ఇవ్వాల్సిందేన‌ని రఘురామ డిమాండ్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఈ విష‌యంలో సాహ‌సించ‌క‌పోవ‌డం.. ఇప్పుడు ర‌ఘురామ వైఎస్ కుటుంబ వ్య‌క్తిగ‌త విష‌యాన్ని తెర‌మీదికి తీసుకురావ‌డం.. వంటివి.. ఎటు మ‌లుపు తిరుగుతాయో చూడాలి.


Tags:    

Similar News