జగన్ ఆస్తుల గోల ఈయనెకుందుకు ?

Update: 2021-08-13 05:30 GMT
యాక్షన్ చేయచ్చు కానీ ఓవర్ యాక్షన్ అన్నీసార్లు పనికారాదు. వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు వ్యవహారం చూస్తుంటే అందరు ఇదే మాట అనుకుంటున్నారు. ఢిల్లీలో ఎంపి మీడియాతో మాట్లాడుతు జగన్ ఆస్తుల్లో సగభాగం సోదరి షర్మిలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజంగా జగన్ కుటుంబ ఆస్తులతో ఎంపికి ఎలాంటి సంబంధమూలేదు. వాళ్ళ ఆస్తులో లేకపోతే అప్పులో కుటుంబం చూసుకుంటుంది మధ్యలో ఈయనకు ఎందుకు ?

గతంలో ఒకసారి జగన్ను వ్యక్తిగతంగా దూషించి నోటికొచ్చినట్లు మాట్లాడితేనే సీఐడీ పోలీసులు కేసు పెట్టి అరెస్టుచేశారు. అరెస్టు తర్వాత కస్టడీలో ఎంపినే చెప్పుకున్నట్లు కాళ్ళు పగిలేట్లు కొట్టారు. చాలా రోజులు చికిత్స కోసమని ఆసుపత్రిలోనే ఉన్నారు. అయినా బుద్ధి మారలేదు. మళ్ళీ వాళ్ళ కుటుంబం గురించి అనవసరంగా ప్రస్తావించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం వెనుక షర్మిల పాత్రకూడా ఉందట. జగన్ తరపున షర్మిల రోడ్డుషోలు చేశారట.

వైసీపీ విజయంలో షర్మిల పాత్ర ఉన్నపుడు జగన్ ఆస్తుల్లో చెల్లెలుకు సగభాగం ఎందుకివ్వరంటూ ఎంపి విచిత్రమైన లాజిక్ మాట్లాడుతున్నారు. మామూలుగా ఎవరైనా ఎదుటివాళ్ళతో పడదు అనుకున్నపుడు వాళ్ళకు దూరంగా ఉంటారు. పైగా ఎదుటివాళ్ళు అత్యంత బలవంతులన్నపుడు అసలు వాళ్ళగురించి కూడా ఆలోచించరు. అలాంటిది కావాలనే ఈ తిరుగుబాటు ఎంపి జగన్ను గోకి గోకి మరీ గొడవలు పెట్టుకుంటున్నారు. అంటే మరో సత్కారానికి తనంతట తానుగా ఎంపి రెడీ అవుతున్నట్లే అనుకోవాలి.

ఇక్కడ గమనించాల్సిందేమంటే బ్యాంకులనుండి వేల కోట్లరూపాయల ప్రజాధనాన్ని దోచేసిన కేసు ఎంపి మీదుంది. బ్యాంకుల కన్షార్షియమే రఘరామ మీద షిర్యాదు చేసింది. దానిపై విచారణ జరిపిన సీబీఐ బ్యాంకు ఫిర్యాదు ఎంపి మీదున్న ఆరోపణలన్నీ నిజమే అని తేల్చింది. ఆ తర్వాత ఎంపిపై సీబీఐ ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసింది. ఈ రోజో రేపో అరెస్టు చేయటమే మిగిలుంది అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఒకవైపు బ్యాంకులనో దోచేసిన కేసులను ఎదుర్కొంటు జగన్ ఆస్తుల పంపకం గురించి డిమాండ్ చేయటం ఈయనకు అవసరమా ?


Tags:    

Similar News