పవన్ పై ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు..

Update: 2021-11-02 05:30 GMT
అధికారపార్టీలో ఉండి ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే ఒకే ఒక్క ఎంపీ రఘురామకృష్ణం రాజు. ప్రభుత్వంపై ధూషణల నేపథ్యంలో గతంలో ఆయన అరెస్టు తరువాత ఎంపీ రఘురామ నిత్యం వార్తల్లో కనిపిస్తున్నారు. అయితే ఆయన చేసే వ్యాఖ్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటాయి. తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఏదో ఒక సంచలన వార్తతో మీడియాలో కనిపించిన ఈ ఎంపీ తాజాగా పవన్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఆయన పవన్ గురించి ఏంమాట్లాడాడో ఒకసారి చూద్దాం..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల బహిరంగ సభను పెట్టి పలు వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి చెందిన కొందరు ఎంపీలు తమకు కాంట్రాక్టులు కావాలని అడుగుతున్నారు గానీ.. రాష్ట్రంలో సమస్యలు గురించి ఒక్కరూ చెప్పడం లేదని కేంద్రమంత్రులు వాపోయారని పవన్ అన్నారు. అధికార ఎంపీలు కేవల స్వప్రయోజనాలే చూసుకుంటున్నారు తప్ప రాష్ట్రం గురించి పట్టించుకోవడం లేదని పవన్ వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై ఎంపీ రఘురామకృష్టం రాజు స్పందించారు. ‘పవన్ చెప్పినదాంటో అబద్ధం లేదు. కొందరు ఎంపీలు అలాగే చేస్తున్నారు. సమస్యలపై ఎంపీలంతా కలిసి కేంద్రమంత్రులను కలిసి పరిష్కారం అవుతుంది కదా..పవన్ చేస్తున్న పోరాటంలో న్యాయం ఉంది. మట్టితో పోరాడితేనే విత్తనం మొలకెత్తుతుంది.. అలాగే సమస్యలపై పోరాటం చేస్తేనే పరిస్కారం అవుతాయి. పవన్ అలాగే చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఎవరేం చేసినా వారిని పొగడాల్సిందే’ అని రఘురామ కృష్ణం రాజు అన్నారు.

ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై అరెస్టు చేయడంపై ఎంపీ వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం సలహాలు ఇస్తే వారిని అరెస్టు చేయడమేనా..? ప్రభుత్వంలోని వారు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు గానీ.. ఇతరులు చిన్న మాటలు అన్నా వారిపై పగ తీర్చుకోవడమేనా..?’ అని అన్నారు. ఇక తనను అరెస్టు చేసినప్పుడు వాళ్లు ఏం చేశారో నేనేం చెప్పను. ఎందుకంటే అదంతా మెడికల్ రిపోర్టులో ఉంటుంది. కోర్టు ప్రకారం నడుచుకోవాలని కాబట్టి ఆ విషయాలు మాట్లాడకుడదు... అని అన్నారు.

‘ఇటీవల మహా పాదయాత్ర ప్రారంభమైంది. అయితే పాదయాత్రలోజగన్ మెప్పు కోసం కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. వీరితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. విజయ్ పాల్ లాంటి ఘనాపాటి అధికారులు సీఎం మెప్పుకోసం ఎప్పటికీ ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వారు పోలీసు శాఖలో చాలా మంది ఉన్నారు. వీరు రకరకాల కుట్రలు పన్ని పాదయాత్రకు భంగం కలిగించేందుకు యత్నిస్తారు. అందువల్ల చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీమీదా ఏ యాంగిల్ నైనా వారు కుట్రలు పన్నే అవకాశం ఉంది.’ అని అన్నారు.

‘మన రాష్ట్రానికి నాలుగు రాజధానులు ఉన్నాయని గూగుల్ లో ఇతర ప్లేసుల్లో చెబుతున్నారు. కానీ వాటిని అభివృద్ది చేయడానికి దమ్మిడి లేదు. ఆ డబ్బు కోసం నానా రకాల తప్పులు చేస్తున్నారు. ఇందులో గవర్నర్ గారిని కూడా ఇన్వాల్వ్ చేశారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్లో గవర్నర్ కు తెలియకుండానే ఆయన సంతకం తీసుకున్నారు. వీరు తెచ్చే అప్పులకు ఎవరు గ్యారంటీ అంటే.. గవర్నర్ పేరును చేర్చి పెద్ద తప్పు చేశారు. ఈ తప్పు హత్యకంటే ఎక్కువ.ఇప్పటి వరకు ఎన్నో రాష్ట్రాలు..ఎన్నో అప్పులు చేశాయి. కానీ ఈ రకంగా వ్యక్తిగత హోదాలో తప్పులు చేయడం చాల నేరం.’ అని రఘురామ అన్నారు.


Tags:    

Similar News